Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ మంత్రి ఆల్ మోస్ట్ ఔటేనా?

By:  Tupaki Desk   |   11 Jun 2020 5:40 PM IST
ఏపీలో ఆ మంత్రి ఆల్ మోస్ట్ ఔటేనా?
X
వైసీపీ పాలన ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, పాలన ప్రజలకు చేరువ అయ్యాయా? సీఎం జగన్ అవినీతి, పారదర్శక పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు. జగన్ నీతిమంతుడిగా ఉన్నా కింద స్థాయి నేతలు అలా ఉంటున్నారా? మంత్రుల పనితీరు ఎలా ఉంది.? ఎమ్మెల్యేలు సరిగా పనిచేస్తున్నారా?

ఇలా ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రుల మీద వైసీపీకి చెందిన ఒక పేపర్, ఒక చానెల్ , ఇంటెలిజెన్స్ వర్గాలు, సీఎంవో ఆఫీస్ లో ఒక అనలిస్ట్ అందరూ కలిసి శూలశోధన మొదలుపెట్టారట.. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు మీద నివేదికలు రూపొందిస్తున్నట్టు అధికారవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

వైఎస్ జగన్ కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ లీక్ కావడంతో ఇప్పుడు నేతలంతా హడలి చస్తున్నారు. ఎమ్మెల్యేలను ఏమీ చేయలేరు కానీ.. మంత్రులకు మాత్రం జలక్ ఇచ్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉందట.. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ తయారైందట.. గోదావరి జిల్లాలో ఉన్న ఒక మంత్రికి చిరిగిపోయే పరిస్థితి ఉందని టాక్ బయటకు వచ్చింది. ఆ మంత్రి అవినీతి చేయకున్నా.. మంచి రిపోర్టులు లేవు అని వినికిడి. దీంతో తొలగించే జాబితాలో ఆ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి మొదటివాడు అవుతాడని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.