Begin typing your search above and press return to search.
మొబైల్ ఫోన్లో 70 శాతం యువత చేసే పని అదేనట?
By: Tupaki Desk | 28 Sep 2022 6:58 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. అన్ని పనులకు అదే జీవనాధారం. ఫోన్ ద్వారానే అన్నీ చేస్తున్న రోజులు ఇవీ. మన అవసరాలు, ఎంటర్ టైన్ మెంట్ కు కూడా మొబైల్ ఫోన్ యే ఆధారం. మన దైనందిన జీవితంలో ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒక భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్ మెంట్ యాప్ వే 2 న్యూస్ ఓ సర్వేలో తేల్చింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నట్టు తేలింది.
ప్రజల ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ఈ సర్వేలో 3,50,000 మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో 88శాతం మంది పురుషులు 12 శాతం స్త్రీలు ఉన్నారు. అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 70శాతం మందికి 21-30 సంవత్సరాల లోపు వారే.. మొత్తంగా తెలంగాణ నుంచి 53శాతం మంది ఉండగా మిగిలిన వారు ఏపీకి చెందిన వారు.
ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నట్లు 31 వాతం మంది చెప్పారు. వస్తువులను ఆఫ్ లైన్ స్టోర్లలో భౌతికంగా చూసి, బట్టలను ట్రయల్ చేసి.. ఎలక్ట్రానిక్స్ చెక్ చేసిన తర్వాతే కొనేందుకు మొగ్గు చూపుతున్నామని 29.5 శాతం మంది తెలిపారు.
కోవిడ్-19 ఆంక్షలు.. లాక్ డౌన్, ప్రజల్లోని భయాలతో విక్రయాలు తగ్గి ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర నష్టాలు చూసిన ఔట్ లెట్లకు ఇప్పుడిప్పుడే వాక్ ఇన్స్ పెరుగుతుండడం ఉపశమనం కలిగేంచే అంశం.
దేశంలో కోవిడ్ ఆంక్షలు లేవు. దీంతో అందరూ తిరిగి ప్రయాణాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50.71 శాతం ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలాకాలం పాటు దేశ ప్రజల ప్రయాణ ప్రాధాన్య క్రమంలో ఉన్న రైళ్ల వైపు ఇప్పుడు కేవలం 26 శాతం మంది మళ్లుతుండగా బస్సులను మరింత తక్కువగా 14శాతం ఎంచుకుంటున్నారు.
కోవిడ్ ప్రభావం గురించి ప్రజలకు అవగాహన పెరగడంతో జాగ్రత్తగా ప్రయాణాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. కాగా.. తెలంగాణలో ఆర్థికంగా మహబూబ్ నగర్ నుంచి 39073 మంది, నల్లగొండ 32403, ఏపీలో వైజాగ్ 21872 , శ్రీకాకుళం నుంచి 20921 మంది సర్వేలో పాలు పంచుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.