Begin typing your search above and press return to search.
మోడీ బంగ్లాదేశ్ పర్యటన అందుకోసమేనట?
By: Tupaki Desk | 27 March 2021 1:30 PM GMTపశ్చిమ బెంగాల్ లో వాడి వేడిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం జరుగుతున్న వేళ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కు మోడీ ఎందుకు వెళ్లాడు? ఆయన వెళ్లడానికి కారణమేంటనే దానిపై తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని నరేంద్రమోడీ తన బంగ్లాదేశ్ పర్యటనలో బెంగాల్ గురించిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడడమేందని ఆమె ఫైర్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా ఖరగ్ పూర్ లో ప్రచారం చేసిన మమతా బెనర్జీ ప్రధాని మోడీ తీరుపై విరుచుకుపడ్డారు. బెంగాల్ లో ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ మాట్లాడలేక బంగ్లాదేశ్ వెళ్లి మాట్లాడుతారా? అంటూ మోడీని ఆమె ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని.. దీనిపై ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారులను తీసుకొస్తున్నారని మోడీ విమర్శిస్తారని.. మరో వైపు బంగ్లాదేశ్ వెళ్లి ఎన్నికల మార్కెటింగ్ చేసుకుంటారని మమత విమర్శలు గుప్పించారు.2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్ కు చెందిన బెంగాల్ కు ప్రచారం కోసం వచ్చారని.. దీంతో బీజేపీ సర్కార్ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అతడి వీసాను రద్దు చేయించిందని మమత గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు బెంగాల్ ఎన్నికల వేళ ఓట్ల కోసం బంగ్లాదేశ్ లో మోడీ తిరుగుతున్నారని మమత ఆరోపించారు. మోడీ వీసా ఎందుకు రద్దు చేయకూడదని మమత ప్రశ్నించారు. మోడీ తీరుపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మమత తెలిపారు.