Begin typing your search above and press return to search.
ఖజానా ఖాళీ.. వరద బాధితులను తర్వాత ఆదుకుంటారట!
By: Tupaki Desk | 24 Nov 2021 4:30 PM GMTఏపీ ఖజానా ఖాళీ అయిందా? కనీసం వరద బాధితులను కూడా ఆదుకోలేని పరిస్థితిలో ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. బాధితులను తాను పరామర్శించేందుకు మాత్రమే వచ్చానని.. అసవరమైన ఆర్థిక సాయం మాత్రం తర్వాత చేస్తామని.. ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఖజానా పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి ప్రతి నెలా రెండో వారం నుంచే ఖజానా ఖాళీ అయిపోతోంది. 1వ తారీకు ఫించన్లు.. 10వ తేదీలోపు జీతాలకు సరిపోతున్న ఆదాయం.. తర్వాత .. సాధారణ ఖర్చులకు కూడా వెతుక్కునే పరిస్థితి వస్తోంది.
ఇప్పుడు అకస్మాత్తుగా తలెత్తిన వరద ముందు బాధితులను ఆదుకునేందుకు నిధులు లేకుండా పోయా యని ఆర్థిక శాఖ వర్గాలు కూడా చెబుతున్నారు. ఇక, దీనికి తాజాగా ముఖ్యమంత్రి.. జగన్ కేంద్రానికి హుటాహుటిన లేఖ సంధించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే వెయ్యి కోట్ల రూపాయల సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
వరద నష్టంపై అంచనాలు వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా అధిక వర్షపాతం నమోదైందని లేఖలో పేర్కొన్నారు. తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లిందని... 196 మండలాల్లో నష్టం సంభవించిందని... వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని లేఖలో పేర్కొన్నారు.
ఈ నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయని... చెరువులకు గండ్లు పడటంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయని... తక్షణ సాయంగా రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలి లేఖలో కోరారు. 4 జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం అధిక వర్షపాతం నమోదైందని, చాలాచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని లేఖలో పేర్కొన్నారు. 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రోడ్లు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయని వివరించారు. దీనిని బట్టి కేంద్రం నిధులు ఇస్తేనే తప్ప.. కనీస సాయం అందించే పరిస్థితి ఉంటుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తింది.