Begin typing your search above and press return to search.

బీజేపీ పని అయిపోయిందా? బబూల్ సిచ్యూవేషన్ ఉందా ఆ పార్టీలో?

By:  Tupaki Desk   |   24 April 2021 8:30 AM GMT
బీజేపీ పని అయిపోయిందా? బబూల్ సిచ్యూవేషన్ ఉందా ఆ పార్టీలో?
X
బీజేపీకి దేశంలో ఎదురుగాలి మొదలైందా? వ్యతిరేక పవనాలు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తున్నాయా? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఓటమి దేన్ని సూచిస్తుంది? త్రిపురలో అధికారంలో ఉండి కూడా అక్కడి ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవడం దేనికి సంకేతం అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

దీన్ని బట్టి దేశంలో బీజేపీకి రానున్న రోజుల్లో కష్టమేనంటున్నారు. ఒకవేళ కనుక ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రాకుంటే మాత్రం బీజేపీ పని అయిపోయిందని అనుకోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క అసోంలో మాత్రమే బీజేపీకి ఎడ్జ్ ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఓటమి తథ్యం అంటున్నారు.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండి ఓడిపోవడం కలవరపరుస్తోంది. అక్కడి గిరిజన మండలి ఎన్నికల్లోనూ బీజేపీ కూటమి దెబ్బతింది. త్రిపురలో అధికారంలో ఉన్నప్పటికీ గిరిజన మండలి ఎన్నికల్లో ఆధిక్యత సాధించలేకపోయింది. 2018 ఎన్నికల్లో 18 నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. కానీ ఈసారి పట్టును నిలుపుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వ నిర్ణయాలేనంటున్నారు. రైతుల నుంచి ఉద్యోగ, కార్మిక వర్గాలేవీ మోదీ ప్రభుత్వానికి సానుకూలంగా లేవు. ఇటీవల జరిగిన పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ చావుదెబ్బ తిన్నది.

పశ్చిమ బెంగాల్ లో మాత్రం మళ్లీ మమతా బెనర్జీ గెలిస్తే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆమె ఒక్కటి చేసే అవకాశం ఉందంటున్నారు. అలా చేస్తే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు రావాలని కొత్త డిమాండ్ తెచ్చే అవకాశం ఉంది. ధర్నాలు, ఆందోళనలతో అన్ని రాష్ట్రాలకు ఒక ఐకాన్ గా మమత నిలబడుతుందని అంటున్నారు.

ఎందుకంటే ఎలా అయినా పశ్చిమ బెంగాల్ లో మమతను ఓడించాలని ఎన్నికలను ఏకంగా 8 విడుతలుగా బీజేపీ నిర్వహిస్తోందని.. ఇప్పుడు ఆమెను ఓడించకపోతే మమత ప్రతీకారం తీర్చుకుంటుందని అంటున్నారు.