Begin typing your search above and press return to search.

2024 కి బీజేపీ ప్లాన్ రెడీ అయిపోయిందా?

By:  Tupaki Desk   |   26 Oct 2022 4:49 AM GMT
2024 కి బీజేపీ ప్లాన్ రెడీ అయిపోయిందా?
X
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక సెంటిమెంటును రాజేయటం బీజేపీకి బాగా అలవాటైపోయింది. అభివృద్ధిని చూపించి ఓట్లడగటానికి, అధికారంలోకి రావటానికి ఏమీలేనట్లుంది. అందుకనే ఎప్పుడు ఎన్నికలన్నా ఏదో ఒక సెంటిమెంటును రెడీ చేస్తూంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే 2024లో ఏప్రిల్-మే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. అందుకని ఇప్పటినుండి సెంటిమెంటును రాజేస్తోంది.

సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రజల దర్శనార్ధం అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది. శ్రీరాంజన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు, ట్రస్టు ప్రధాన కార్యద్శి చంపత్ రాయ్ మాట్లాడుతు 2024, జనవరి నుండి ప్రజలందరు రామదర్శనం దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట జరగ్గానే జనాలందరినీ జనవరి నుంచి ఆలయ దర్శనానికి అనుమతించబోతున్నట్లు ప్రకటించారు.

ఆలయ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు చంపక్ రాయ్ చెప్పారు. ఇప్పటికి ఆలయ పనులు 50 శాతం పూర్తయిన పోయాయన్నారు. మకర సంక్రాంతికి ఆలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన అయిపోతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నెలకు ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధమైపోతుందన్నారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించిన విషయాన్ని కూడా చెప్పారు. రామాలయ ఆలయ నిర్మాణానికి మొత్తం మీద రు. 18 వేల కోట్లు ఖర్చవుతుంని రాయ్ అంచనా వేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రతి ఎన్నికకు ఏదో ఒక సెంటిమెంటును సీన్లోకి తీసుకువస్తున్నది బీజేపీ. ఒకసారి కార్గిల్ యుద్ధమని, మరోసారి పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్సని, అంతకుముందు బాబ్రీమసీదని, మొన్నటి ఎన్నికల్లో అయోధ్యలో రామమందిరమని జనాల్లో సెంటిమెంటును రాజేసింది.

ఇపుడు వచ్చే ఎన్నికలకు మూడు నెలల ముందు అయోధ్య రామమందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరిపి జనాలను ఆకర్షించే ప్రయత్నాలు స్పీడందుకున్నాయి. విగ్రహ ప్రతిష్టాపన జనవరిలో జరగటం, వెంటనే భక్తుల సందర్శనకోసం ఆలయాన్ని తెరిచేయటం అంటే జనాల్లో శ్రీరాముడి సెంటిమెంటును రాజేసే ప్రయత్నంగానే అనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.