Begin typing your search above and press return to search.

కరోనా అంతం కలనేనా? రాబోయే పరిస్థితులు అవేనా?

By:  Tupaki Desk   |   21 May 2021 7:39 AM GMT
కరోనా అంతం కలనేనా? రాబోయే పరిస్థితులు అవేనా?
X
కరోనా మహమ్మారి ఏడాది నుంచి వణికిస్తోంది. ప్రపంచ దేశాల్లో పంజా విసురుతోంది. దీనిని కట్టడి చేయడానికి చాలా దేశాల్లో, రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్నాళ్లు భరిస్తే ఈ గడ్డుకాలం నుంచి బయటపడతామని ప్రజలు అనుకుంటున్నారు. కానీ నిపుణుల మాటలను బట్టి చూస్తే కోరనా అంతం కలనే అని అనిపిస్తోంది. కొవిడ్ అనేది పూర్తిగా అంతం కాదని... కొన్ని సీజనల్ వ్యాధుల్లాగా ఇదీ మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా వచ్చిన తొలినాళ్లలో ఉన్న భయాందోళనలు ఇప్పుడు లేవనే చెప్పాలి. మరికొన్నాళ్లు ఇలాగే ఉంటే వైరస్ సర్వసాధారణంగా మారుందని చెబుతున్నారు. ఇక అప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు. ఇది సుదీర్ఘ ప్రక్రియని పేర్కొన్నారు. అత్యధిక శాతం మంది వైరస్ ను జయించినప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యామని వెల్లడించారు. 60 నుంచి 70 శాతం మంది వైరస్ ను ఎదుర్కొవాలని అన్నారు. అందుకు కాస్త సమయం పట్టొచ్చని అంచనా వేశారు.

కాలక్రమేణా కరోనా పాజిటివిటీ రేటు తగ్గి... ప్రమాద స్థాయి తగ్గుతుందని చెబుతున్నారు. మశూచిలాగే కరోనా ఉంటుందని పేర్కొన్నారు. మశూచిని ఎదుర్కొన్నట్లే కరోనాను ఎదుర్కొగలమని చెబుతున్నారు. అందుకు ఒకటి హెర్డ్ ఇమ్యూనిటీ కాగా మరొకటి వ్యాక్సినేషన్ అని తెలిపారు. ఇప్పటివరకు జనాభాలో 20 శాతం మందికి కొవిడ్ ను జయించే రోగ నిరోధక శక్తి లభించిందని వెల్లడించారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచిస్తున్నారు.

మ్యూటేషన్ల వల్ల హెర్డ్ ఇమ్యూనిటీకి ఎక్కువ సమయం పడుతుందని మరికొందరు అంటున్నారు. వైరస్ నిరంతరం మార్పులు చెందుతూ దాడి చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పొందలేరని చెబుతున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో మ్యూటేషన్ కేసులు నమోదయ్యాయి. కొన్ని మ్యూటేషన్లు అసలు వైరస్ కన్నా ప్రమాదకరంగా మారుతున్నాయని అంటున్నారు. అయితే కరోనాను పూర్తిగా ఎదుర్కొవడం కాస్త కష్టమేనని అంటున్నారు. వివిధ దేశాల్లోని పరిస్థితులను చూస్తే హెర్డ్ ఇమ్యునిటీ ఇప్పట్లో కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.