Begin typing your search above and press return to search.

కరోనా మారుతోంది.. వ్యాక్సిన్ తయారీ కష్టమేనా?

By:  Tupaki Desk   |   15 May 2020 9:50 AM GMT
కరోనా మారుతోంది.. వ్యాక్సిన్ తయారీ కష్టమేనా?
X
ప్రపంచమంతా కరోనా బీభత్సం చూస్తున్నారు. అగ్రరాజ్యాలు, పేద రాజ్యాలు అన్న తేడా లేకుండా సర్వం కరోనా మయమైంది. కరోనా కంట్రోల్ చేయలేక అన్ని దేశాలు సతమతమవుతున్నాయి. వ్యాక్సిన్ల తయారీలో పురోగతి కనిపించడం లేదు. చూస్తుంటే ఏదో ఒక మానవాతీత శక్తి వచ్చి ఆదుకోవడమో.. లేక మనిషిలోని సహజ రోగనిరోధక శక్తి రావడమో తప్ప ఇప్పటికిప్పుడు కరోనాకు 100శాతం పనికొచ్చే మందు లేదు.

ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉంది. వేల సంఖ్యలో ప్రజలు కరోనాతో పిట్టల్లా రాలుతున్నారు. ప్రజలు, ప్రభుత్వాలు మిగతా పనులన్నీ వదిలేసి దీనిమీదే పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ వ్యాక్సిన్ తయారు చేసేందుకు పరుగులు పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఫార్మా కంపెనీ నోవార్టీస్ 2021 వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తానని ప్రకటించింది. దాదాపు 12 నుంచి 18 నెలల్లో వ్యాక్సిన్ తయారవుతుందని చెబుతున్నాయి.

అయితే వ్యాక్సిన్ తయారు చేయడం అంత ఈజీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ మొదట పుట్టిందానికి ఇప్పుడు ఉన్నదానికి మార్పు చెందుతోంది.. మొదట వైరస్ కు వ్యాక్సిన్ కనిపెడితే ఇప్పుడు వ్యాపిస్తున్న వ్యాధి కంట్రోల్ కాదు.. పైగా దేశాలను బట్టి కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందుతోంది. అంటే మార్పు చెందుతోంది. ఇటలీ, బ్రిటన్, అమెరికా వంటి శీతల దేశాల్లో ఈ మహమ్మారి కోరలు చాస్తుండగా.. భారత్ వంటి వేడి దేశాల్లో నెమ్మదిగా వ్యాపిస్తోంది. దీనిపై భారత శాస్త్రవేత్తలు కూడా జన్యు స్థాయి పరిశోధన చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు రోగుల ద్వారా సేకరించిన కరోనావైరస్ జాతులపై పరిశోధన చేయడంలో బిజీగా ఉన్నారు. వారంతా తమ దేశంలో సోకుతున్న కోవిడ్ -19 వైరస్ యొక్క ఉత్పరివర్తనాల గురించి తాజాగా ఆశ్చర్యకరమైన వెల్లడించారు. 260 రోగులకు రోగులను కరోనా వైరస్ ను విశ్లేషించిన తరువాత, బ్రిటీష్ జన్యు శాస్త్రవేత్తలు కోవిడ్ -19 దాదాపు 12 రకాల ఉత్పరివర్తనలు తమ దేశంలో ఉన్నట్లు కనుగొన్నారు. అంటే 12 రకాల కరోనా వైరస్ లు ఇంగ్లండ్ దేశంలో రోగులకు వ్యాపిస్తున్నట్టు తేల్చారు.

అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఆ జాతులలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది యునైటెడ్ కింగ్ డమ్ లో మాత్రమే వెలుగుచూసిందట.. అంటే కరోనా వైరస్ బ్రిటన్ లో పూర్తిగా కొత్త వైరస్ గా మారిందన్నమాట.. ఇప్పుడు చైనాలో సోకిన దానికి దీనికి పొంతనే లేదు. కాబట్టి మొదట కరోనా వైరస్ కు తయారు చేసిన వ్యాక్సిన్ దీనికి పనిచేయదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా యూకే స్వదేశీ కోవిడ్ -19 వైరస్ గా అక్కడి శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. . అంటే దేశానికో వైరస్ ఉందన్నమాట.. 12 రకాల వైరస్ లుగా మారాయి. వాటన్నింటికి వ్యాక్సిన్ లు కనిపెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఉహించుకుంటేనే భయంగా ఉంది. అప్పటివరకు అన్ని బంద్ చేసి ఇంట్లో కూర్చోవడం సాధ్యమా? కరోనాకు ఎదురెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడమా అన్నది ఇక్కడ అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

కరోనా మహమ్మారి మొదట మార్చిలో ఎక్కువగా వ్యాపించిన ఇటలీ , స్పెయిన్ నుండి బ్రిటన్ దేశానికి దిగుమతి అయ్యింది.ఇతర దేశాల నుండి దిగుమతి అయిన వైరస్ లలో బ్రిటన్ లో ఏ వైరస్ జాతి ఎక్కువగా ప్రబలుతోందనేది పరిశోధకులు వెల్లడించలేదు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెస్తున్న పరిశోధకులకు ఇలా 12 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని తెలియడంతో ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్లు బ్రిటన్‌ దేశ ప్రజలపై ప్రభావం చూపవనే ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే వినాశనం తప్పదు. కరోనావైరస్ అన్ని జాతులకు అనుకూలంగా వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు భయపడుతున్నారు.

హెచ్.ఐవీ లేదా ఎయిడ్స్ వంటి వైరస్ కూడా ఇలాంటిదే.. అది మార్పు చెందుతూ ఉంటుంది. అందేకే 1970వ దశకంలో బయటపడ్డ దానికి ఇప్పటికీ మందు లేదు. ఇప్పుడు కరోనా కూడా అలానే మార్పులు చెందుతోంది. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది. రోజురోజుకు స్ట్రాంగ్ గా అవుతున్న ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడం కష్టం అనే వారు లేకపోలేదు. ఇక కనిపెట్టినా చాలా సమయం అవుతుంది.

దీన్ని బట్టి మనం కరోనా వ్యాక్సిన్ వస్తేనే అది తీసుకొని బయటకు వెళదాం అని ఊరుకుంటున్న సంపన్నులు, సెలెబ్రెటీలు ఆశలు వదిలేసుకుంటే మంచిది. ఆ వైరస్ సోకకుండా ప్రస్తుతానికి సోషల్ డిస్టేన్స్ నిబంధనలు పాటించడం.. శానిటైజర్లు మాస్కులు ధరించి పనిలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. సో ఇప్పటికైనా కరోనాను చూసి భయపడకుండా.. వ్యాక్సిన్ కోసం ఎదురుచూడకుండా ముందడుగు వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.