Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రులకు శాపం తగిలిందా?

By:  Tupaki Desk   |   27 Nov 2019 5:22 AM GMT
తెలంగాణ మంత్రులకు శాపం తగిలిందా?
X
తెలంగాణ మంత్రుల కు ఏమైంది? వరుసగా ఎందుకు ప్రమాదాలకు గురి అవుతున్నారు? ఏదైనా శాంతి చేయాల్సి ఉంటుందా? వారికేమైనా శాపం తగిలిందా? ఎందుకీ ప్రమాదాలు.. మరణాలు.. అంటే మంత్రుల స్వయం కృతాపరాధంగానే చెప్పవచ్చు.

తెలంగాణ మంత్రులు సోకులకు పోయి ప్రమాదాలు కొనితెచ్చుకుంటాన్నారనే విషయం వెలుగుచూసింది.ఇటీవలే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్ లో వెనుక వస్తున్న వెహికల్ బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం లో ఇద్దరు మరణించడం విషాదం నింపింది. స్వయంగా ఎర్రబెల్లి తన డ్రైవర్ పాడె మోసిన వైనం కన్నీళ్లు పెట్టించింది.

ఇక ఎర్రబెల్లి నే కాదు.. మంత్రి ఈటెల కారు కూడా ఆ మధ్య బోల్తాపడింది. బుల్లెట్ ఫ్రూఫ్, బెలూన్లు తెరుచుకోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇక మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లుకూడా ప్రమాదాల బారిన పడ్డారు..

మంత్రుల వాహనాలకు తరచూ జరుగుతున్న ప్రమాదాలపై పోలీసులు ఆరాతీయగా సంచలన విషయం వెలుగుచూసింది. మంత్రులు ప్రభుత్వం ఇస్తున్న బుల్లెట్ ఫ్రూఫ్ భద్రత కలిగిన ఫ్యార్చూనర్ వాహనాలను వదిలి సొంత విలాసవంతమైన బెంజ్, ఓల్వో లాంటి హై ఎండ్ కార్లను వాడడమే కారణంగా తేల్చారు. ఇవి సెకన్లలో 100 కి.మీల స్పీడు తో వెళ్తుంటే దాన్ని అందుకునే ప్రయత్నంలో మంత్రి కాన్వాయ్ లోని మిగతా వాహనాలు స్పీడు పెంచి కంట్రోల్ కాక ప్రమాదాల బారిన పడుతున్నాయి.

మంత్రుల కార్ల కు ప్రమాదాల పై పోలీసు శాఖ సీఎం కేసీఆర్ కు ఇటీవలే నివేదిక అందించిందట.. దీంతో కేసీఆర్ ఖచ్చితంగా మంత్రులంతా ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లే వాడాలని ఆదేశించారట.. మరి మన మంత్రులు ఇప్పటికైనా మారుతారో లేదో చూడాలి.