Begin typing your search above and press return to search.

కేసుల పెరుగుదలకు ఎన్నికల ప్రచారమే కారణమా..?

By:  Tupaki Desk   |   24 April 2021 10:30 AM GMT
కేసుల పెరుగుదలకు ఎన్నికల ప్రచారమే కారణమా..?
X
ఇండియాలో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. లక్షలకు మించి పాజిటివ్ కేసులు.. లెక్కదొరకని మరణాలతో భారత్ బెంబేలెత్తుతోంది. అయితే ఫస్ట్ వేవ్లో లక్షా 10వేల వరకు కేసులు పెరిగి ఆ తరువాత తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ ఎందుకు పెరిగాయి..? టెస్ట్ లు చేసేంతలోపే వ్యాప్తి ఇంత తీవ్రంగా ఎందుకు మారింది..? ఈ కేసులు పెరగడానికి ఎన్నికలే కారణమా..? ఎన్నికలు నిర్వహించకపోతే ఈ వైరస్ ఉధృతి ఇంతలా ఉండకపోవునా..? అనే అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

ఫిబ్రవరి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా 10 వేల లోపు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక కరోనా నుంచి ఉపశమనం పొందినట్లే అని భావించారు. అదే సమయంలో వ్యాక్సిన్ కూడా దేశ వ్యాప్తంగా పంపిణీ కావడంతో ప్రజల్లోనూ కాస్త ధైర్యం వచ్చింది. అయితే అంతలోనే వారిలో నిర్లక్ష్యం పెరిగింది. అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉన్నవారు విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరగడం ప్రారంభించారు. దీంతో తక్కువ స్థాయిలో ఉన్న వైరస్ మరింత విజృంభించింది.

ఇటీవల ఎన్నికలు దేశంలో కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యాయి. పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు కేసుల పెరుగుదలకు కారణమయ్యాయని అంటున్నారు. అయితే దానికి ఆధారాలు మాత్రం లేవని అంటున్నారు. ఎందుకంటే కరోనా బహిరంగ ప్రదేశాల కంటే అంతర్గతంగా జరిగే సమావేశాలతోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సభల్లో నాయకులు గట్టిగా మాట్లాడడం.. అరవడం వల్ల వారి తుంపిర్లు మిగతా వారిపై కూడా పడి వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయని అంటున్నారు.

ఇక ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో భక్తులు జాగ్రత్తలు పాటించకపోవడం కనిపించిందని అంటున్నారు. ఇక్కడ పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహిస్తే ఇప్పటి వరకు 1600 కేసులు నమోదయ్యాయి. ఎన్నికలతోనే కేసులు పెరిగాయని నిరూపితం కాలేదని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో కాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఏదీ ఏమైనా కొన్ని జాగ్రత్తలను ప్రజలతో పాటు ప్రభుత్వం విస్మరించడం విపత్తుకు కారణమయ్యారని పలువురు భావిస్తున్నారు.