Begin typing your search above and press return to search.

గన్నవరం, గుడివాడ నేతలను ఈడీ భయం వేధిస్తోందా?

By:  Tupaki Desk   |   28 July 2022 3:47 PM GMT
గన్నవరం, గుడివాడ నేతలను ఈడీ భయం వేధిస్తోందా?
X
క్యాసినో నిర్వాహకులపైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రెండు నియోజకవర్గాల అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తోందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలు ఈ క్యాసినోల వ్యవహారంలో బాగా తలపండిపోయారని చర్చ జరుగుతోంది.

ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గోవాను మించిపోయేలా గుడివాడలో భారీ ఎత్తున క్యాసినోలు నిర్వహించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని గుడివాడ అధికార పార్టీ ముఖ్య నేతపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

అంతేకాకుండా గుడివాడ, గన్నవరం అధికార పార్టీ నేతలు మంచి ఫ్రెండ్స్‌ అని, క్యాసినోల వ్యవహారం, చిలక్కొట్టుడు వ్యవహారాల్లో వీరిద్దరిది ఒకే అభిరుచి అని చెబుతున్నారు.

వీరిద్దరూ గతంలో టీడీపీలో ఉండి వైఎస్సార్సీపీలో చేరినవారేనని అంటున్నారు. ఈ ఇద్దరు ముఖ్య నేతలతోపాటు వారి అనుచరులు సైతం గతంలో శ్రీలంక, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో నిర్వహించిన క్యాసినోల్లో పాల్గొన్నారని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై నోరు చేసుకోవడంలో మంచి పేరు పొందారని.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈడీ దాడులపై కలత చెందుతున్నారని అంటున్నారు. హైదరాబాద్‌లో ఈడీ దాడుల్లో అడ్డంగా దొరికపోయిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఏమాత్రం నోరు విప్పినా గన్నవరం, గుడివాడ అధికార పార్టీ ముఖ్య నేతలకు చిక్కులు తప్పవనే చర్చ ఆ రెండు నియోజకవర్గాల్లో సాగుతోంది.

అయితే ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఈడీ దాడులపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. గుడివాడ నేత మీడియాకు ముందుకొచ్చి దమ్ముంటే ఈడీతో తనను అరెస్టు చేయించాలని ప్రతిపక్ష నేతలను సవాల్‌ చేయడం ఇందులో భాగమని అంటున్నారు. మరో ముఖ్య నేత ఇటీవల కరోనా బారిన పడ్డారని.. ఇప్పుడు ఈడీ దాడుల భయం కూడా పట్టుకుని వణుకుతున్నారని ఆ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.