Begin typing your search above and press return to search.

సర్కార్ సొమ్ము ప్లీడర్ల ఫీజుల పాలేనా ...?

By:  Tupaki Desk   |   18 Oct 2022 1:30 AM GMT
సర్కార్ సొమ్ము  ప్లీడర్ల ఫీజుల పాలేనా ...?
X
ఏపీ సర్కార్ సొమ్ము అంతా కోర్టులలో లాయర్ల ఫీజుల పాలు అని కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం అంటే ప్రజలది. అలా ప్రజా ప్రయోజనమైన కేసులలో వారికి లాభం కలగాలని, న్యాయం జరగాలని లాయర్లను పెట్టి కేసులు వాదించుకుంటే తప్పు లేదు. కానీ ప్రతీ చిన్న విషయంలోనూ ప్రభుత్వం కోర్టులకు వెళ్తోంది. బోలెడు ఫీజులు దానికి న్యాయ వాదులకు ఖర్చు చేస్తున్నారు.

ఇది చాలా కాలంగా జరుగుతున్న చర్చ. అయితే ఇదే విషయం మీద సుప్రీం కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడమే విశేషం. పోలవరం అట్టిసీమ, పురుషోత్తమపురం ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ నిబంధననలు ఉల్లఘించారంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ సర్కార్ కి భారీ ఎత్తున జరీమానాను విధించింది.

అయితే ఆ జరీమానాను ప్రభుత్వం చెల్లించకుండా తమ వైపు వాదనలు వినిపించడం కోసం సుప్రీం కోర్టులో కేసులను నడుపుతోంది అంటున్నారు.

అయితే సుప్రీం కోర్టు దీని మీద మాట్లాడుతూ అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విద్ధించిన జరీమానా కంటే కూడా లాయర్లకు చెల్లిస్తున్న ఫీజులే ఎక్కువగా ఉన్నాయేమో అన్న డౌట్ ని వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో జరీమానాల కింద విధించిన ఫీజులను చెల్లించి తీరాల్సిందే అని ఖరాఖండీగా చెప్పేసింది.

అదే విధంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇఛ్చిన తీర్పులోని ఇతర అంశాలను సైతం అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూవచ్ఛే ఏడాది ఫిబ్రవరికి కేసుని వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున ఫీజులను చెల్లిస్తూ లాయర్లను పెట్టుకుంటోందని, తీరా ఆ కేసులు కూడా ఏవీ నెగ్గకపోగా ప్రభుత్వానికి షాకులు తగులుతున్నాయని అంటున్నారు. మరి ఇలా ఫీజులకు చెల్లించడం పెద్ద మొత్తాలు ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.