Begin typing your search above and press return to search.

సానియా - మాలిక్ విడాకులకు ఆ హీరోయిన్ కారణమా..?

By:  Tupaki Desk   |   11 Nov 2022 10:30 AM GMT
సానియా - మాలిక్ విడాకులకు ఆ హీరోయిన్ కారణమా..?
X
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరియు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారని.. విడాకులు తీసుకోబోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం సానియా దుబాయ్ లో.. షోయబ్ పాక్ లో విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. విడాకుల వార్తలపై సానియా-షోయబ్ ఇంకా స్పందించ లేదు. కానీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని దృవీకరించినట్లుగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు వీరి మధ్య మనస్పర్ధలు రావటానికి ఓ మోడల్ కారణమని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆయేషా ఒమర్ మోడల్ కమ్ యాక్టర్ తో కలిసి షోయబ్ మాలిక్ 2021లో ఓ మ్యాగజైన్ కోసం బోల్డ్ ఫొటో షూట్ చేశాడు. హెల్త్ అండ్ ఫిట్నెస్ పై అవగాహనలో భాగంగా రూపొందించిన ఈ షూట్ లో.. చాలా సన్నిహితంగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

స్విమ్మింగ్ పూల్ లో దిగి ఫోటోలకు ఫోజులివ్వడమే ప్రొఫెషనలిజమా అంటూ షోయబ్ - ఆయేషా లపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. షోయబ్ మాలిక్ రెండో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోందని కూడా కామెంట్స్ పెట్టారు. అయితే ఈ బోల్డ్ షూటే సానియా దంపతుల మధ్య విభేదాలకు కారణమైందని అంటున్నారు.

ఈ ఫోటో షూట్ మీద అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ స్పందించారు. ఫొటో షూట్ సమయంలో ఆయేషా ఒమర్ తనకు బాగా సహకరించిందని అన్నాడు. దీనిపై మీ భార్య సానియా ఎలా స్పందించారని ప్రశ్నించగా.. 'మీ భర్త కూడా ఇలాంటి ఫొటో షూట్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి?' అని షోయబ్ ఎదురు ప్రశ్నించాడు.

హోస్ట్ వెంటనే తనకింకా పెళ్లి కాలేదని చెప్పడంతో.. సానియా కూడా మీలాగే రియాక్ట్ అవ్వలేదు అని షోయబ్ అన్నాడు. దీన్ని బట్టి ఆయేషా తో చేసిన ఫొటో షూట్ కారణంగానే భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చి ఉంటాయని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దీనికి తోడు సానియా మీర్జా 'హృదయం ముక్కలైంది' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా ఈ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక సానియా - షోయబ్ మాలిక్ ల విడాకుల వార్తల నేపథ్యంలో.. ఆయేషా - షోయబ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆయేషా ఒమర్ మోడల్ గా గాయనిగా యూబ్యూబర్ గా ప్రాచుర్యం పొందింది. కరాచీ సే లాహోర్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సానియా- షోయబ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇజహాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు సానియా - షోయబ్ పన్నెండేళ్ళ వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టనున్నట్లు పుకార్లు వచ్చాయి. మరి త్వరలోనే ఈ జంట ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.