Begin typing your search above and press return to search.
ఎంపీకి మెజారిటీ పెరిగిపోతోందా ?
By: Tupaki Desk | 9 Feb 2022 5:30 AM GMTఅదేంటి ఎన్నికలైపోయి రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇపుడు ఎంపీకి మెజారిటీ పెరగటం ఏమిటని ఆలోచిస్తున్నారా...? అవును మీరు చదివింది కరెక్టే. ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు 3 లక్షల ఓట్ల మెజారిటీ వస్తుందని చాలెంజ్ చేశారు.
అంటే ఇపుడు ఎంపీ రాజీనామా చేయలేదు. ఒకవేళ రాజీనామా చేస్తే, ఉప ఎన్నికలు వస్తే, మళ్ళీ తాను పోటీ చేస్తే రాబోయే మెజారిటీ గురించే ఎంపీ చెప్పింది.
ఇదే ఎంపీ ఆ మధ్య మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తాను 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ప్రకటించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు ఎంత మెజారిటీ వస్తుందో చెబుతున్న ఎంపీ రాజీనామా మాత్రం చేయటం లేదు. రాజీనామా చేయకపోగా ఆ విషయాన్ని అప్పుడు ప్రకటిస్తా, ఇపుడు ప్రకటిస్తా, తొందరలోనే ప్రకటిస్తానంటు చెబుతున్నారు.
అసలు ఎంపీని రాజీనామా చేయమని జనాలు ఎవరు అడగలేదు. కొందరు వైసీపీ నేతలు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలవమని అప్పుడెప్పుడో చాలెంజ్ చేశారు.
ఎంపీ వ్యవహారశైలి చూసిన తర్వాత వాళ్ళు కూడా రాజీనామా డిమాండ్ ను వదిలేశారు. అసలు ఎంపీని పట్టించుకోవటమే మానేశారు. ఎంపీయే తనంతట తానుగా రాజీనామా చేస్తానని, ఏ పార్టీ తరపున పోటీ చేసేది చెబుతానని ఇలా రోజుకో ప్రకటన చేస్తూ వార్తల్లో కనబడుతున్నారు.
ఉప ఎన్నికలో పోటీ చేస్తే రాబోయే మెజారిటీ 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుకోవడం బాగానే ఉంది. ఎందుకంటే ఎంత మెజారిటీ వస్తుందనే నోటి లెక్కలకు అడ్డేముంది ? అయితే వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో ఎంపీకి వచ్చిన మెజారిటి ఎంతో తెలుసా సుమారు 30 వేలు మాత్రమే.
అది కూడా రఘురాజు వైసీపీ తరఫున పోటీ చేశారు కాబట్టే వచ్చింది. వైసీపీ తరపున కాకుండా ఇంకో పార్టీ తరపున పోటీ చేసుంటే రాజుగారి కెపాసిటి ఏమిటో బయటపడేది. ఎంపీ అయిన కొత్తల్లో తన గెలుపుకు జగన్మోహన్ రెడ్డే కారణమని చాలాసార్లు చెప్పారు. తర్వాత జగన్ తో చెడిన దగ్గర నుండి తాను పోటీ చేయబట్టే నరసాపురంలో వైసీపీ గెలిచిందంటు కబుర్లు చెబుతున్నారు.
మొత్తానికి ఇప్పటికైతే 3 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేస్తే అప్పుడింకెంత మెజారిటి చెప్పుకుంటారో ?