Begin typing your search above and press return to search.

ఎంపి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   5 Aug 2021 5:53 AM GMT
ఎంపి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా ?
X
వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించి జైలుకు పంపుతానని శపథాలు చేస్తుంటారు. మరోవైపు జగన్ మంచిపాలకునిగా పేరు తెచ్చుకోవాలనంటారు. జగన్ తో చెడిన కారణంగా ఎంపిని యావత్ పార్టీ దూరంగా పెట్టేసింది. ఇదే సమయంలో పార్టీతో తిరిగి కలిసే ఉద్దేశ్యంలో ఎంపి కూడా లేరని తెలిసిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లోనే మన జగన్ అని, మన పార్టీ అని, మనమందరము అని తనని తాను పార్టీ నేతగానే బిల్డప్పులు ఇచ్చుకుంటున్నారు.

ఇక్కడే అందరికీ ఎంపిది ఓవర్ యాక్షన్ అని అర్ధమైపోతంది. నిజానికి పార్టీతో ఎప్పుడైతే చెడిందో అప్పుడే ఎంపి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసుంటే హుందాగా ఉండేది. కానీ రఘురామ నుండి అలాంటి హుందాతనాన్ని ఆశించటం తప్పే. పోనీ జగన్ తో చెడిన తర్వాత పార్టీకి దూరమైన ఎపిం కామ్ గా ఉన్నారా అంటే అదీలేదు. ఏదేదో నోటికొచ్చినట్లు మాట్లాడుతునే ఉన్నారు. చివరకు వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేయటంతోనే పరిస్దితులు విషమించిపోయాయి.

సరే ఈ విషయాలను వదిలేస్తే తాజాగా వైసీపీ ఎంపిలందరం రాజీనామా చేద్దామంటు ప్రతిపాదించటమే విచిత్రంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో టీడీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తామని చేసిన ప్రకటనను ఎంపి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పనిలోపనిగా మనమందరం కూడా ఎంపి పదవులకు రాజీనామాలు ఇచ్చేద్దామని వైసీపీ ఎంపిలను కలుపుకోవటమే విడ్డూరం. ఎంపి పదవులకు రాజీనామాలు చేసే ఉద్దేశ్యంలో టీడీపీ నేతలు లేరని అందరికీ తెలుసు.

నిజంగానే ఎంపి పదవులకు రాజీనామాలు చేసేవాళ్ళే అయితే వైసీపీ ఎంపీలతో వంతుపెట్టుకోరు. రాజీనామాలు చేద్దామని చెబుతునే మెలిక పెడుతున్నారంటేనే టీడీపీ ఎంపిల చిత్తశుద్ది ఏమిటో అర్ధమైపోతోంది. కాబట్టి టీడీపీ ఎంపిల రాజీనామాల ప్రకటన అంతా డ్రామాని అందరికీ తెలిసిపోతునే ఉంది. రఘురామ కూడా వాళ్ళతో కలవాలని అనుకుంటున్నారు కాబట్టి టీడీపీ ఎంపిలను ఒప్పించి మొత్తం నలుగురు రాజీనామాలు చేస్తే బాగుంటుంది. చంద్రబాబునాయుడు, టీడీపీ ఎంపిలు అడిగితేనే రాజీనామాలపై మాట్లాడని వైసీపీ ఎంపిలు రఘురామ అడిగితే చేస్తారా ?