Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తుకు ఏపార్టీ రెడీగా ఉంది ?

By:  Tupaki Desk   |   30 May 2021 4:30 PM GMT
టీడీపీతో పొత్తుకు ఏపార్టీ రెడీగా ఉంది ?
X
పొత్తులు లేకపోతే ఒంటరిగా తెలుగుదేశంపార్టీ మనలేదన్న విషయం మరోసారి బయటపడింది. నిజానికి ఎన్టీయార్ టీడీపీని పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు లెక్కతీస్తే ఎక్కువ పొత్తులు వామపక్షాలతోనే పెట్టుకుంటునుంది. మధ్యలో బీజేపీతో రెండుసార్లు పొత్తు పెట్టుకుని లాభపడింది. చివరకు ఎన్టీయార్ ఏ పార్టీని వ్యతిరేకిస్తు పార్టీని పెట్టారో చివరకు చంద్రబాబునాయుడు అదే కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టేసుకున్నారు.

చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తర్వాత పొత్తులు లేకుండా రెండుసార్లు మాత్రమే ఒంటరిగా పోటీచేసింది. 2004లో మొదటిసారి పోటీ చేసినపుడు చిత్తుగా ఓడిపోయింది. ఆ అనుభవంతో 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, వామపక్షాలతో పొత్తులు కట్టి ఎన్నికలకు వెళ్ళినా ఓటమి తప్పలేదు. ఆ అనుభవంతోనే రాష్ట్ర విభజన నేపధ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

ఒకవైపు బీజేపీ మరోవైపు జనసేన పొత్తులతో ఏదోలా గెలిచామని అనిపించుకున్నారు చంద్రబాబు. అయితే ఐదేళ్ళు తిరిగేసరికి చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవటానికి ఏ పార్టీ కూడా మిగల్లేదు. మధ్యలో 2018 తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చివరకు టీడీపీకి బద్ధశతృవైన కాంగ్రెస్ తో కూడా జతకట్టేశారు. మళ్ళీ అదే పొత్తు ఏపిలో కనబడలేదు.

తాజగా జరిగిన డిజిటల్ మహానాడులో తాజాగా పొత్తుల వ్యవహారంపై చర్చించారు. కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని తీర్మానం చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం మీదే చంద్రబాబు దృష్టిఉంది. అయితే కమలం నేతలేమో చంద్రబాబుతో పొత్తు కుదరదంటే కుదరదంటున్నారు.

హోలు మొత్తంమీద అర్ధమైందేమంటే ఏదో పార్టీతో పొత్తులేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్ళలేందని. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ ఒంటరిగానే పోటీచేసింది. పార్టీ చరిత్రలోనే ఎప్పుడు ఎదురుకానంత ఘోర పరాజయం ఎదురైంది. దాంతో పొత్తులు లేకపోతే కష్టమన్నట్లుగా తాజా మహానాడులో నేతలు మాట్లాడుకున్నారు. మరి ఏ పార్టీ చంద్రబాబుతో పొత్తుకు రెడీగా ఉందో చూడాల్సిందే.