Begin typing your search above and press return to search.
సాగర్ ప్రచారంలో అధికార పార్టీ పండుగ ఆఫర్ మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 14 April 2021 6:30 AM GMTతాజాగా జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికను తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే కావొచ్చు.. తమకు అధిక్యతకు అవసరమైన ఏ చిన్న విషయాన్ని వదలకుండా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల వేళ.. ఓటర్లను తమవైపు తిప్పుకోవటానికి అధికార పార్టీ అదిరిపోయే ఆఫర్ ను అనూహ్యంగా తెర మీదకు తెచ్చినట్లు చెబుతున్నారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ మరికొద్ది రోజుల్లోకి వచ్చేసిన వేళ.. ఉగాదికి స్పెషల్ గిఫ్టు ఇవ్వాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలోని ఓటర్లకు ఊహించని బహుమతిని అందించినట్లుగా చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఒక్కో ఇంటికి ఒక కేజీ మటన్ తో పాటు..ఒక బాటిల్ మద్యాన్ని పంపిణీ చేశారు. వాస్తవానికి పోలింగ్ రెండు రోజుల ముందు నుంచి ఇలాంటి పంపిణీలు చేస్తుంటారు.
తాజా ఉప ఎన్నికల వేళ అనుకోని రీతిలో ఉగాది రావటంతో అధికార పార్టీ చొరవ ప్రదర్శించి.. ఒక అడుగు ముందుకేసి మటన్.. మద్యం బాటిళ్లను పంచినట్లు చెబుతున్నారు. దీంతో.. ఉలిక్కిపడిన ప్రతిపక్షపార్టీలు సైతం తాము మాత్రం తగ్గేది లేదన్న చందంగా వారు కూడా ఇదే తరహాలో పంపిణీ షురూ చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఉగాది వేళ.. అధికార పార్టీ పుణ్యమా అని సాగర్ ఓటర్లకు సరికొత్త పండుగగా మారింది.