Begin typing your search above and press return to search.

క‌రోనా సెకండ్ వేవ్‌.. కేంద్రం హై అల‌ర్ట్‌.. కొత్త నిబంధ‌న‌లు ఇవే!

By:  Tupaki Desk   |   5 March 2021 6:30 AM GMT
క‌రోనా సెకండ్ వేవ్‌.. కేంద్రం హై అల‌ర్ట్‌.. కొత్త నిబంధ‌న‌లు ఇవే!
X
దేశ‌వ్యాప్తంగా కొవిడ్ మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. కొంత కాలంగా.. దేశంలో కొవిడ్ తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతూ వ‌చ్చింది. కానీ.. ఈ మ‌ధ్య మ‌ళ్లీ కేసులు పెరుగుతుండ‌డంతో ఆందోళ‌న కూడా పెరుగుతోంది. మ‌హారాష్ట్ర వంటి ప్రాంతాల్లో తీవ్రంగా కొత్త‌ కేసులు న‌మోదువుతున్న‌యి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. రాష్ట్రాలు సీరియ‌స్ గా తీసుకోవాల‌ని సూచించింది.

క‌రోనా తొలినాళ్ల‌లో లాక్ డౌన్ కార‌ణంగా దేశం మొత్తం నాలుగు గోడ‌ల‌కే ప‌రిమిత‌మైంది. ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని చేసుకున్నారు. దీంతో.. కొత్త కేసుల్లో త‌గ్గుద‌ల న‌మోదైంది. ఆ ప‌రిస్థితి చాలా కాలం కొన‌సాగ‌డంతో కేంద్రం క్ర‌మంగా లాక్ డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ వ‌చ్చింది. ఆఫీసులు మొదలు.. షాపింగ్ మాళ్లు, ఇతర దుకాణాలు అన్నీ తెరుచుకున్నాయి. జనం సాధారణ స్థితిలోకి వచ్చేశారు. చాలా ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు. దీంతో.. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతుండడం గమనించాల్సిన అంశం. గడిచిన 24 గంటల్లో 17,407 కేసులు నమోదయ్యాాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా ప్రకటించిందే. అంతేకాదు.. ఈ ట్వీట్ లోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

ప్రజలు ఎక్కువగా వెళ్లివ‌చ్చే షాపింగ్ మాల్స్‌, రెస్టారెంట్స్‌, ప్రార్థ‌నా మందిరాల్లో త‌ప్ప‌కుండా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని ఆదేశించింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు మార్చి 1వ తేదీ నుంచే అమ‌ల్లో ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు క‌రోనా జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించింది. ఈ నిబంధ‌న‌లు ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా రాష్ట్రాలు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌ని ఆదేశించింది.