Begin typing your search above and press return to search.

‘మూన్ లైటింగ్’ చేసిన భారత్ లో పరిస్థితి మెరుగవడం లేదా..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 12:30 AM GMT
‘మూన్ లైటింగ్’ చేసిన భారత్ లో పరిస్థితి మెరుగవడం లేదా..!
X
మూన్ లైటింగ్ అంటే ఒక ప్రధాన ఉద్యోగం చేస్తూ అదనపు ఖర్చుల కోసం మరో ఉద్యోగం చేయడం. ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతి ఎప్పటి నుంచి ఉంది కానీ కరోనా కాలంలో ఈ విధానం బాగా ఫేమస్ అయింది. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ వచ్చాక స్టాప్ వేర్ ఉద్యోగులు ఐటీ కంపెనీలకు తెలియకుండా మరోచోట ఉద్యోగం చేసి రెండు చేతుల సంపాదించారు.

ఈ నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగుల తీరును బడా కంపెనీలు తప్పుబట్టాయి. పనిలో తేడా వస్తుందని చెబుతూ కొందరిని జాబ్స్ నుంచి తొలగించాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా మూన్ లైటింగ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మూన్ లైటింగ్ విధానాన్ని సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఈ విషయం పక్కన పెడితే భారత్ లో రెండు ఉద్యోగాలు చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రోజురోజుకు రూపాయి విలువ అంతర్జాతీయంగా క్షీణిస్తుండటం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్.. డీజీల్ ధరలు సెంచరీని దాటేయడంతో ఈ ప్రభావం నిత్యావసర ధరలపై పడుతోంది.

దీనికి తోడు గ్యాస్ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనంపై ప్రభావం చూపుతోంది. కరోనా కాలంలో ఇంటి అద్దెలను చాలామంది యజమానులు పెంచలేదు. అయితే రెండేళ్ల తర్వాత ఒక్కసారి పెద్ద మొత్తంలో ఇంటి అద్దెలను పెంచడం ఉద్యోగులను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.

కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలకు సైతం భారీగా పోటీ పెరిగిపోయింది. దీంతో తక్కువ జీతానికి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు ఇంట్లో ఒకరు పని చేస్తూ నలుగురు ఖాళీగా ఉంటున్నారు. ఆర్థిక మాంద్యం పేరుతో యాజమాన్యాలు జీతాలను ఏమాత్రం పెంచడం లేదు.

నిత్యావసర ధరలు రెండింతలు కాగా ఇంటి అద్దెలు.. కరెంటు.. సెల్ ఫోన్.. పాల బిల్లులు.. నల్లా పన్ను.. ఇంటి పనులన్నీ కూడా ఈ రెండేళ్ల కాలంలో భారీగానే పెరిగిపోయాయి. దీంతో సామాన్య.. మధ్యతరగతి ప్రజలు వీలైనంతగా విందు.. వినోదాలు.. షాపింగ్ లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

కుటుంబాలు తమ ఖర్చును ఎంత తగ్గించుకున్నప్పటికీ జీతం మాత్రం ఒకటి తారీకు వచ్చేలోగా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఈ కారణంగానే భారత్ లో రెండు ఉద్యోగాలు చేసినా ఏమాత్రం ఉద్యోగస్థుల జీవితాల్లో ఏమాత్రం మెరుగుదల లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.