Begin typing your search above and press return to search.
వైఎస్ ఆత్మ ఘోషిస్తోందా? సన్నిహితుల మాట ఇదే!
By: Tupaki Desk | 1 Sep 2021 4:09 PM GMTఔను! దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ ఘోషిస్తోందా? మరో రోజులో ఆయన 12 వ వర్ధంతి జరుగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు, సన్నిహితులు మేధావులు.. ఇదే మాట చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్ కుటుంబంలో జరుగుతున్న రాజకీయ అలజడి.. వైఎస్ అభిమాను లకు తీవ్ర కలవరం పుట్టిస్తోంది. ``ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితిని నేను చూడలేదు. వైఎస్ కుటుంబంతో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ పరిస్థితి దారుణం`` అని ఏపీకి చెందిన ఒక సీనియర్ నేత తాజాగా వ్యాఖ్యానించారు.
ఒక్క ఈయననే కాదు.. తాజాగా మారుతున్న పరిణామాలు.. జరుగుతున్న పనులు గమనిస్తున్న వైఎస్ అభిమానులు ఒకింత ఆవేదన, ఆందోళనతోనే ఉన్నారు. సెప్టెంబరు 2న వైఎస్ 12వ వర్ధంతి జరగనుంది. దీనికి సంబంధించి కడపలోని ఇడుపుల పాయలో ఉన్న సమాధి వద్ద కుటుంబ సభ్యులు.. ప్రార్థనలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ తనయుడు, ఆయన కుమార్తె.. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల.. హాజరు అవుతున్నారు. అయితే.. ఎప్పటిలాగా కాకుండా.. గత జూలైలో జరిగిన జయంతి మాదిరిగా.. ఎవరికివారు వేర్వేరు షెడ్యూళ్లలో హాజరు అవుతున్నారు.
నిజానికి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి.. ఒకే సమయంలో సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇడుపుల పాయలోని చర్చిలో సామూహిక ప్రార్థనల్లోనూ పాల్గొనే వారు. కానీ,ఇ ప్పుడు అన్నా చెల్లెళ్లను.. రాజకీయాలు దూరం చేశాయి. ఈ పరిణామం నిజంగానే వైఎస్ ఆత్మను శోకించేలా చేస్తుందని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక, మరో విషయానికి వస్తే.. ఆయన సొంత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఎప్పుడూ.. అటు జయంతి, ఇటు వర్ధంతి కార్యక్రమాలలోపాల్గొనేది. కానీ, ఇప్పుడు వైఎస్ కార్యక్రమానికి వచ్చేది డౌటేనని అంటున్నారు.
ఇక, మరోవైపు.. విజయమ్మ.. ఈ ఏడాది వర్ధంతి రోజునే..(సెప్టెంబరు 2) వైఎస్ అనుచరులు, ఆయన హయాంలో రాజకీయంగా చక్రాలు తిప్పిన వారికి ఆహ్వానాలు పంపారు. పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని హోటల్ లో.. సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి చాలా మందినే ఆహ్వానించారు. అయితే.. ఎంత మంది వస్తారు? అనేది డౌటే. ఒకవేళ ఈ కార్యక్రమం కొద్దిమందితో సాగి.. కీలక నేతలు రాకపోయినా.. విఫలమైనట్టే అవుతుంది. పైగా .. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ను విజయమ్మ ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఎటు చూసినా.. ఇలాంటి పరిణామాలతో వైఎస్ ఆత్మ కు శాంతి లేదని అంటున్నారు ఆయన అభిమానులు.