Begin typing your search above and press return to search.

సూపర్ సైక్లోన్ దీపావళికి దెబ్బేయనున్నదా?

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:37 AM GMT
సూపర్ సైక్లోన్ దీపావళికి దెబ్బేయనున్నదా?
X
కావాలంటే పడని వర్షాలు.. ఈసారి మాత్రం వద్దంటే పడుతున్న పరిస్థితి. గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాదీయులు ఎప్పుడూ ఎదుర్కోనన్ని ఇబ్బందుల్ని ఈసారీ వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పడిన వర్షపాతం కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్న వేళలో..

తాజాగా సూపర్ సైక్లోన్ ఒకటి ముంచుకొస్తుందన్న మాట ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో.. దీని ప్రభావం ఈసారి దీపావళి వేడుకల మీదకు తప్పనిసరిగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దీపావళి పర్వదినాన నిరుత్సాహం తప్పదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అండమాన్ వద్ద సముద్రంలో ఏర్పడిన అవర్తనం స్థిరంగా ఉందని.. ఇవాల్టికి (గురువారం) అల్పపీడనంగా మారుతుందన్న మాటను చెబుతున్నారు. ఈ నెల 22 ఉదయానికి వాయుగుండంగా మారి మరింత బలాన్ని పుంజుకొని 23న తుపానుగా మారుతుందని చెబుతున్నారు. అయితే.. తుపాను తీవ్రత.. అదెక్కడ తీరం దాటుతుందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని చెబుతున్నారు. 22 నుంచి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కెరటాల తీవ్రత ఎక్కువంటున్నారు.

ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం అమావాస్య నాటికి (దీపావళికి) తుపాను తీరానికి చేరువ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకాసి అలలు విరుచుకుపడే సూచనలు ఉన్నాయి. గాలి తీవ్రత.. వర్షపాతం ఎంత పడే అవకాశం ఉందన్న విషయం ఈ నెల 22 నాటికి స్పష్టమవుతుందని చెబుతున్నారు.

అమావాస్య.. పౌర్ణమి వేళల్లో సముద్రంలో ఆటుపోట్లు తీవ్రంగా ఉండటం తెలిసిందే. అలాంటిది సూపర్ సైక్లోన్ సందర్భంగా పరిస్థితి మరెలా ఉంటుందన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది. వాతావరణ విభాగానికి చెందిన అధికారుల అంచనా ప్రకారం ఈ సూపర్ సైక్లోన్ కారణంగా ఏపీ.. తెలంగాణ.. ఒడిశా.. పశ్చిమ బెంగాల్ కు ప్రభావం ఉంటుందంటున్నారు. అయితే.. తుపాన్ ఏ దిశగా ప్రయాణిస్తుందన్న వివరాలపై మరింత అవగాహనకు 22 వరకు వెయిట్ చేయాల్సిందేనని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.