Begin typing your search above and press return to search.
ఇప్పుడు జరుగుతోన్నది మూడో ప్రపంచ యుద్దమా?
By: Tupaki Desk | 20 March 2020 5:43 AM GMTదగ్గర దగ్గర గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎప్పుడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రెండు యుద్ధాల కారణంగా ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారో.. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. కాకుంటే.. యుద్దవిమానాలు.. ట్యాంకులు.. శతఘ్నులు.. బుల్లెట్లు.. రక్తపాతాలు లేకున్నా.. వేలాది ప్రాణాలు వైరస్ పుణ్యమా అని బలి అవుతున్నాయి. కంటికి కనిపించని శత్రువు తో ప్రపంచం పోరాటం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా కరోనా కారణంగా దారుణ ప్రభావానికి లోనైంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా దెబ్బకు అతలాకుతలమైపోతోంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో అగ్రరాజ్యంలో 2700కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అనుమానితులు వేలాదిగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 10,200కు దాటగా.. 152 మంది కరోనా కారణంగా బలయ్యారు. కరోనా తో ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతున్న వేళ.. సహాయక చర్యల మీద ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పదివేల కోట్ల డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీ మీద సంతకం చేశారు. వైరస్ ఉచిత నిర్దారణ పరీక్షలు నిర్వహించటం తో పాటు.. కోవిడ్ తో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వేతనం తో కూడిన సెలవులు మంజూరు చేసేందుకు తాజా నిధుల్ని వినియోగించనున్నారు.
అగ్రరాజ్యం పరిస్థితే ఇలా ఉంటే.. యూరోప్ దేశాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆసియా.. ఆఫ్రికా దేశాల్లోనూ కరోనా వైరస్ తీవ్రత ఉంది. ఆసియా తో పోలిస్తే ఆఫ్రికాలో పరిస్థితి ఫర్లేదన్న మాట వినిపిస్తోంది. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్లలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. వీలైనంతవరకూ దాన్ని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల కారణంగా యావత్ ప్రపంచం ప్రభావితమైంది. తమకు సంబంధం లేకున్నా యుద్ధంలో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితి. కరోనా వైరస్ విషయంలోనూ ఇప్పుడిలానే జరిగింది. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు కనిపించే శత్రువు తో యుద్ధం చేస్తే.. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.