Begin typing your search above and press return to search.

‘మాన్సాస్’లో పట్టం రాజులకేనా? రాణులకు లేదా?

By:  Tupaki Desk   |   1 July 2021 10:04 AM IST
‘మాన్సాస్’లో పట్టం రాజులకేనా? రాణులకు లేదా?
X
రాజులు, రాజ్యాలు పోయినా వారి గీసిన కట్టుబాట్లు, వ్యవహారాలు మాత్రం ఇంతటి ఆధునిక సమాజంలోనూ మారకపోవడం మన దౌర్భగమ్యనే చెప్పాలి. కాలం మారింది.. సమాజంలో రుగ్మతలు పోయాయి. ‘ఆడవారు వంటింటి కుదేళ్లు’ అనే నానుడి నుంచి ఇప్పుడు సమాజంలో సగం.. అవకాశాల్లో సగం అనేవరకు వచ్చింది. అయినా ఇది పురుషాధిక్య సమాజం. ఇప్పటికీ మహిళలకు చోటు లేదని గిరిగీసి కొట్లాడుతున్న పరిస్థితి ఉంది.

విజయనగరం పూసపాటి వంశీయుల ‘మాన్సాస్ ట్రస్ట్’ కథ ఇదీ. ఈ రాజవంశీయులు శాసనం రాజుకున్నారు. ఇంటికి పెద్దవారికే పీఠం అని.. అది మగ పురుషుడికే దక్కాలని రాసుకున్నారు. ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అందుకే ‘మాన్సాస్ ట్రస్ట్’ నుంచి సంచయితను తొలగించి ఆమె బాబాయ్ అయిన టీడీపీ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మరోసారి టేకప్ చేసేశారు.

అయితే ఆడవాళ్లకు ఏపీ ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాలు పెద్దపీట వేస్తున్నాయి. రిజిర్వేషన్ కూడా కల్పించారు. ఏపీలో అయితే 50శాతం సీట్లను మహిళలకే సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. మరి ఆడకూతురు సంచయితను ఎందుకు మాన్సాస్ ట్రస్ట్ లో అధికారం ఇవ్వడం లేదని తాజాగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కేవలం మహిళ అన్న కారణంతో సంచయితను ఆ పదవికి ఎలా అనర్హురాలు అని ప్రకటిస్తారని అశోక్ గజపతిరాజు ను ప్రశ్నించారు. మాన్సాస్ పీఠంపైన మహిళలు కూర్చోవద్దు అంటూ ఒక రాజు తీర్మానిస్తే అది ఇప్పటికీ శిలాశాసనంగా అవుతుందా? అంటూ ఆమె నిలదీశారు.

మొత్తానికి ఇంత ఆధునిక సమాజంవైపు పోతున్నా కూడా ఇంకా మహిళలకు అవకాశాలు దక్కడం లేదని తెలుస్తోంది. మహిళ అన్న కారణంతో పదవి నుంచి దించేశారంటే ఇంకా మన సమాజంలో వారి పట్ల వివక్ష కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు.