Begin typing your search above and press return to search.

భారత్ కి అమెరికా వ్యాక్సిన్ సాయం నిజమేనా ... బైడెన్ మంత్రులు కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   29 May 2021 11:09 AM IST
భారత్ కి అమెరికా వ్యాక్సిన్ సాయం నిజమేనా ... బైడెన్ మంత్రులు కీలక వ్యాఖ్యలు !
X
ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభణ దెబ్బకి బాగా కుదేలైన దేశాల్లో అమెరికా , భారత్ తోలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటంలో రెండు దేశాలు కూడా కలిసి ముందుకు నడవాలని నిర్ణయం తీసుకున్నాయి. శనివారం నాటికి గ్లోబల్ గా కొవిడ్ కేసులు 17కోట్లకు, కరోనా మరణాలు 35.4లక్షలకు చేరగా, కేసులు, మరణాల్లో అమెరికా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కరోనా ను అరికట్టాలంటే కేవలం వ్యాక్సిన్ తోనే సాధ్యం. కానీ భారత్ లో వ్యాక్సిన్ల కొరత తీరేలా అమెరికా నుంచి సహాయం పొందేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న సంగత తెలిసిందే.

మరోవైపు రెండు దేశాల వ్యాక్సిన్ మైత్రిపై వ్యూహాత్మక సంస్థల ప్రతినిధులు మాత్రం భిన్నంగా మాట్లాడటం కలకలం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారంనాడు వాషింగ్టన్ డీసీలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్, యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ అస్టిన్‌ లతో భేటీ అయ్యారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలతోపాటు ప్రాంతీయంగా నెలకొన్న సమస్యలు, కరోనా వైరస్ రెండో వేవ్ లో భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఇండో, పసిఫిక్ రీజియన్ లో చైనాను నిలువరించే క్వాడ్ ప్రయత్నాలు, మయన్మార్ లో సైనిక తిరుగుబాటు వల్ల తలెత్తిన అశాంతి తదితర అంశాలపైనా ఇరు నేతలు మాట్లాడుకున్నారు.

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థాయి మంత్రి చేస్తున్న తొలి పర్యటన కావడంతో జైశంకర్ రాకను అమెరికా కీలకంగా భావిస్తుంది. ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్, ఆంటోని బ్లింకెన్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా ఉత్పాతం మొదలైన తొలినాళ్లలో అమెరికాకు భారత్ ఎంతో సహాయం చేసింది. అండగా నిలబడింది. ఆ విషయాన్ని మేం ఎన్నటికీ మర్చిపోలేం. రెండో వేవ్ లో భారత్ కు అన్ని విధాలుగా అండగా ఉండాలని అమెరికా భావిస్తున్నది అని బ్లింకెన్ చెప్పారు. చర్చించుకోడానికి మా మధ్య చాలా విషయాలున్నాయి. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా కొనసాగుతున్నాయి. కష్టంలో ఉన్న భారత్ కు బలమైన మద్దతు, సంఘీభావం తెలిపినందుకు అమెరికాకు కృతజ్ఞతలు అని జైశంకర్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారంనాడు అమెరికాలోని టాప్ కార్పొరేట్ కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. భారత్ కు కొవిడ్ వ్యాక్సిన్ల అందజేతలో ఆయా కంపెనీలన్నీ సహకరిస్తాయని తొలుత ప్రకటనలు వెలువడ్డాయి. కానీ నిజానికి ఆ భేటీలో వ్యాక్సిన్ల గురించిన చర్చలు జరగలేదని ముఖేష్ బాంబు పేల్చారు. కేవలం కంపెనీల విస్తరణ, ఉద్యోగాల కల్పన, అవకాశాల సృష్టి లాంటి అంశాలపై మాత్రమే జైశంకర్ మాట్లాడారుతప్ప కరోనా వైరస్ వ్యాక్సిన్లపై చర్చ జరగలేదని అఘీ తెలిపారు.