Begin typing your search above and press return to search.

యోగి రాజ్యంలో మరీ ఇంత అరాచకమా? రేప్ ప్రయత్నాన్ని ప్రశ్నిస్తే చంపేశారు

By:  Tupaki Desk   |   14 March 2021 6:00 PM IST
యోగి రాజ్యంలో మరీ ఇంత అరాచకమా? రేప్ ప్రయత్నాన్ని ప్రశ్నిస్తే చంపేశారు
X
లైంగిక వేధింపులు.. అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలు ఈ మధ్య కాలంలో మరింత పెరుగుతున్నాయి. నిక్కచ్చి పాలనకు కేరాఫ్ అడ్రస్ అని బీజేపీ నేతలు మా గొప్పగా కీర్తించే ఉత్తరప్రదేశ్ లో తాజాగా ఒక దారుణం చోటు చేసుకుంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఈ దారుణం వింటే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. మరీ ఇంత ఆరాచకమా? అన్న సందేహం కలుగక మానదు.

ప్రయాగ్ రాజ్ జిల్లాలోని బువాపూర్ గ్రామానికి చెందిన ఒక బాలిక పోలాల్లో మేకల్ని మేపేందుకు వెళ్లింది. ఆమెపై కన్నేసిన ఒకడు.. ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడు. లైంగికంగా వేధిస్తూ ఆమె వస్త్రాల్ని చించేశాడు. ఇంతలో ఆ అమ్మాయి బిగ్గరగా అరుస్తూ.. తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో.. భయపడిన నిందితుడు పారిపోయాడు. ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి తనపై జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది.

ఆగ్రహానికి గురైన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ నిందితుడి కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా.. బంధువులతో కలిసి వచ్చిన నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి తల్లిని దారుణంగా కొట్టేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. కూతురికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించిన ఆమెను హత్య చేసిన వైనం ఇప్పుడువిస్తుపోయేలా చేస్తోంది. మరీ దారుణం గురించి యోగి సర్కారుకుపడుతుందో? లేదో? చూడాలి.