Begin typing your search above and press return to search.
ఏపీలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందా? ఆర్ ఆర్ ఆర్ జోస్యం నిజమేనా?
By: Tupaki Desk | 3 Oct 2022 1:53 PM GMTఏపీ అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఎందు కంటే.. అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0పై మంత్రులు, నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్రను ఆపేస్తామని.. రైతుల కాళ్లు విరగ్గొడతామని.. అసలు మా ప్రాంతంలోకి మీరు ఎలా వస్తారని.. ఇలా.. అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. నిజానికి హైకోర్టు ఆదేశాలు, అనుమతుల నేపథ్యంలోనే.. రైతులు పాదయాత్ర చేస్తున్నారు.
అయినా.. కూడా నాయకులు, మంత్రులు రైతులపై దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. ధిక్కరణ కిందకే వస్తుందన్నది ఆర్ ఆర్ ఆర్ చెబుతున్న మాట. మరోవైపు.. ‘మా ఆస్తులపై మీ బొమ్మలేంటి?.. రీ సర్వే పేరుతో సొమ్ములు కొట్టేయాలని చూస్తున్నారు.. 70శాతం భూములున్నవారిపై మీ బొమ్మ వేసుకుంటారా?.. దీనికి నేను ఒప్పుకోను.. అవసరమైతే కోర్టుకు వెళ్తా’’ అని ఎంపీ రఘురామ ఏపీ సర్కారును హెచ్చరించారు. రేషన్‌పై ప్రభుత్వం కొత్త స్కీమ్ పెట్టే ప్రయత్నంచేస్తోందని విమర్శించారు.
పీడీఎస్‌లో ఇచ్చే బియ్యం బదులు.. డబ్బు ఇస్తామంటున్నారని ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. రాజధాని వికేంద్రీ కరణపై ఎంపీ భరత్ సభకు బుద్ధిలేని మంత్రులు హాజరయ్యారని రఘురామ దుయ్యబట్టారు. కోర్టు అనుమతితో అమరావతి యాత్ర జరుగుతోందని తెలిపారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాష్ట్రపతి పాలన రావడం ఖాయమని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.
ఇప్పటికే నిండా కేసుల్లో మునిగిపోయిన.. ఏపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో మరిన్ని కేసులు తగులు కోవడం ఖాయమని ఆయన అన్నారు. ఇదే జరిగితే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. మరి ఆయన చెప్పిన జోస్యం నిజమవుతుందా? అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.