Begin typing your search above and press return to search.
బీజేపీ ఏపీ అధ్యక్షుడి మార్పు తప్పదా?
By: Tupaki Desk | 15 Nov 2022 8:32 AM GMTబీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు మార్పు తప్పదా అంటే ఒక వర్గం మీడియా అవుననే గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తోంది. ఒక వర్గం మీడియానే కాకుండా ఏపీ బీజేపీలోని కొంతమంది నేతలు సైతం ఇదే లీకులు ఇస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగడం కష్టమేనని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
వాస్తవానికి 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అందులోనూ సోము వీర్రాజు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం జనసేన పార్టీతో బీజేపీ పొత్తులో ఉంది. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేన–బీజేపీ కూటమి విజయపథంలో పయనిస్తుందని బీజేపీ అధిష్టానం తలచింది.
అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సంబంధాలను పునరుద్ధరించడానికి సోము వీర్రాజు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీలోనే ఒక వర్గం ఆరోపిస్తోందని వినికిడి.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీర్రాజును మోదీ గుర్తించలేదని, తనను తాను పరిచయం చేసుకోవాలని కోరినట్లు కొన్ని పత్రికలు కథనాలు ప్రసారం చేశాయి.
ఈ వార్తలు ఎంతవరకు సరైనవో ఎవరికీ తెలియదు. కానీ వీర్రాజు సన్నిహిత వర్గాల ప్రకారం.. బిజెపి కోర్ కమిటీలోని కొంతమంది నాయకులు బిజెపి జాతీయ నాయకత్వం ముందు ఆయనను చెడుగా చూపించడానికి ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని అంటున్నారు. తద్వారా సోము వీర్రాజును కీలకమైన ఎన్నికల ముందు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కుట్ర పన్నారని చెబుతున్నారు.
వీర్రాజును పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని, అందుకే ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన సోము వీర్రాజుకి ఎలాంటి క్రెడిట్ దక్కకుండా చేశారని సోము సన్నిహితులు మండిపడుతున్నారట. ప్రధాని మోడీ పర్యటన మొత్తాన్ని హైజాక్ చేసేందుకు బీజేపీలోని కొంతమంది నేతలు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.
అయితే, బీజేపీ కోర్ కమిటీ నాయకులతో సమావేశం సందర్భంగా ప్రధాని.. సోము వీర్రాజుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నేతల అలసత్వంపై మోడీ కాస్త గట్టిగానే తలంటినట్టు ప్రచారం జరిగింది.
దీంతో ఏపీ బీజేపీ నాయకత్వాన్ని సవరించాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మోదీ స్పష్టమైన సందేశం పంపారని అంటున్నారు. ఇది నిజమే అయితే సోము వీర్రాజు స్థానంలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఎవరు నియమిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.