Begin typing your search above and press return to search.

కొడాలి నాని, వంశీ ఇద్ద‌రికీ తేడా వ‌చ్చిందా?

By:  Tupaki Desk   |   6 Dec 2021 1:30 PM GMT
కొడాలి నాని, వంశీ ఇద్ద‌రికీ తేడా వ‌చ్చిందా?
X
నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌లిసిమెలిసి తిరిగిన కృష్నాజిల్లాకు చెందిన కీల‌క నాయ‌కులు, ఒకే సామాజిక వ‌ర్గాని కి చెందిన యువ నేత‌లు.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల మ‌ధ్య స్నేహం చెడిందా? వారి ద్ద‌రి మ‌ధ్య తేడా వ‌చ్చిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల ను గ‌మ‌నిస్తే.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య తేడా వ‌చ్చిన‌ట్టుగానే ఉంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీలో చంద్ర‌బా బు పై జ‌రిగిన ఘ‌ట‌న అనంత‌రం.. నంద‌మూరి కుటుంబం రియాక్ట్ అయింది. అయితే..త‌ర్వాత ప‌రిణామా ల్లో.. వైసీపీ కి సెగ బాగా త‌గ‌ల‌డం ప్రారంభ‌మైంది.

దీంతో ఇప్పుడు కీల‌క నేత‌లు అంద‌రూ ఒక‌వైపు.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారిన టీడీపీ(టెక్నిక‌ల్‌గా) ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌వైపు అన్న‌ట్టుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పటి వ‌ర‌కు.. వంశీని వైసీపీ ఎమ్మెల్యేలు అంద‌రూ వెనుకేసుకు వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని.. వైసీపీకి అనుకూలంగా మారిన వంశీ .. అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడిపై విరుచుకుప‌డుతున్నారు.

ఇక, ఇటీవ‌ల బాబు స‌తీమ‌ణి..భువ‌నేశ్వ‌రిపైనా.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌ట్లో మౌనంగా ఉన్న వైసీపీ నాయ‌కులు.. ఈ విష‌యంలో అసెంబ్లీ వ‌ర‌కు పాగ‌డం.. దీనిపై చంద్ర‌బాబు, నంద‌మూరి ఫ్యామిటీ సీరియ‌స్ కావ‌డంతో వ్యూహం మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు చెబుతున్న వ్యాఖ్య‌ల‌కు మూలం వంశీనేన‌ని.. భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవ‌ల ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ.. టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేనే చంద్ర‌బాబును అవమానించాడ‌ని.. తాము కాద‌ని.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఇక‌, ఇటీవ‌ల ప్ర‌భుత్వ అనుకూల మీడియాతో మాట్లాడిన‌.. మంత్రి కొడాలి నాని కూడా.. త‌న మిత్రుడు.. ఎప్పుడూ.. ఎక్క‌డికి వెళ్లినా.. క‌లిసి ఉండే వ‌ల్ల‌భ‌నేని వంశీని.. టార్గెట్ చేశారు. ``వంశీ ఏదో అంటే.. మ‌మ్మ‌ల్ని తిట్ట‌డం ఎందుకు?`` అంటూ.. వంశీని దూరంగా పెడుతున్న‌ట్టు కొడాలి ఇండైరెక్ట్‌గా సంకేతాలు పంపేశారు.

అంతేకాదు.. నెల్లూరు కు చెందిన కొటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, క‌డ‌ప కు చెందిన రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిలు.. వ‌ల్ల‌భ‌నేని వంశీని టార్గెట్ చేసిన‌ప్పుడు.. ఆయ‌న మా పార్టీ నాయ‌కుడు కాద‌ని చెప్పిన‌ప్పుడు.

అయినా.. కొడాలి స్పందించి.. ఉంటార‌ని, ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆయ‌న మాత్రం రియాక్ట్ కాలేదు. సో.. ఈ పరిణామాల‌ను బ‌ట్టి.. వంశీకి.. కొడాలికి మ‌ధ్య తేడా వ‌చ్చింద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.