Begin typing your search above and press return to search.
మోడీ యూట్యూబ్ కు మంచి గిరాకీ వచ్చిందే?
By: Tupaki Desk | 28 Dec 2022 3:30 AM GMTనరేంద్ర మోడీ.. ఈ పేరు భారత్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మారుమోగుతోంది. ఒకప్పుడు నరేంద్ర మోడీకి యూత్ ఫాలోయింగ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అన్ని వర్గాలు మోడీకి అభిమానులుగా మారారు. అసలు నరేంద్ర మోడీకి ఎంతమంది అభిమానులు ఉన్నారు..? అనే విషయం సాధారణంగా చెప్పడం కష్టమే. కానీ ఆయన పేరు మీద నిర్వహించిన యూట్యూబ్ ఛానెల్ మాత్రం మోడీకి ఉన్న ఫాలోయింగ్ డిక్లేర్ చేసింది. నరేంద్ర మోడీ పేరుపై అధికారికంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్ కు ఇటీవల కోటి మంది సబ్ స్క్రైబర్లు అయ్యారు. అంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలు నిత్యం నిత్యం వీక్షించేలా ఏర్పాటు చేసుకున్నారు. ఒక రాజకీయ నాయకుడి ఛానెల్ కు ఇంత మంది సబ్ స్క్రైబర్లు గా మారడం విశేషమేనని అంటున్నారు.
2014లో దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ అంతకుముందే గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. ఆయన చేసిన అభివృద్ధి అప్పట్లో యూత్ ను బాగా ఆకర్షించింది. దీంతో ఆయన గుజరాత్ లో చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా చేయాలని పలువురు కాంక్షించారు. ఈ క్రమంలో ఆయన టెక్నికల్ గా సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు. ఇలా విపరీతంగా యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న ఆయన 2014లో దేశ పీటమెక్కారు. అదే ఊపుతో 2019లోనూ రెండోసారి ప్రధాని అయ్యారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఓ వైపు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే.. విపత్కర సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. కరోనా సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలో ఆయన చేసే కార్యక్రమాలు నిత్యం తెలుసుకునేందుకు మోడీ చానెల్ ను ఫాలో అవుతున్నారు. అయితే రాజకీయంగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా హోంమంత్రి అమిత్ షాతో కలిసి మోడీ రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో ఆయన వేసే ఎత్తుగడలు రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారనే చెప్పవచ్చు.
మొన్నటి వరకు ఉత్తరాదిలో మాత్రమే మోడీ హవా కొనసాగేది. కానీ ఇప్పుడు దక్షిణాదిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో తమ ప్రభుత్వం లేకపోయినా ఇతర ప్రభుత్వాలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి కార్యక్రమాలు నిరంతరం వీక్షించాలని ఎవరూ కోరుకోరు. కానీ నరేంద్ర మోడీకి సంబంధించిన ప్రతీ న్యూస్ తెలవాలని సబ్ స్రైబర్లుగా మారారు. ఇలా కోటి మంది కావడం మామూలు విషయం కాదని అంటున్నారు.
130 కోట్ల దేశ జనాభాలో కోటి మంది సబ్ స్క్రైబర్లు కావడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ సొంత పార్టీతో పాటు ఇతర పార్టీ నాయకులు సైతం ఆయన స్పీచ్ వినేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్థం అవుతోంది. అయితే ఈ సబ్ స్క్రైబర్ల సంఖ్య రాను రాను మరింత పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సాంకేతికంలో ఎప్పటికప్పడు అప్ డేట్ గా మారే మోడీ ఫాలోయింగ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.