Begin typing your search above and press return to search.

దేశంలో ఆరోగ్య విపత్తు తప్పదా?

By:  Tupaki Desk   |   21 April 2021 1:13 PM GMT
దేశంలో ఆరోగ్య విపత్తు తప్పదా?
X
దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. కాదెవరు కరోనాకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి సామాన్యుల దాకా.. రాజకీయ నేతల నుంచి సినీ ప్రముఖుల దాకా అందరినీ కరోనా బారిన పడేలా చేస్తోంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు సైతం కరోనా బారినపడుతున్నారు.

కరోనా తీవ్రంగా ప్రబలడం.. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్న వేళ ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఈ క్రమంలోనే పరిశ్రమల నుంచి ఆక్సిజన్ ను ఆస్పత్రులకు మళ్లించండి అని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. దీన్నిబట్టి దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పకనే చెప్తాయి. ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా కరోనా సోకినట్లు తెలుతోంది. దీంతో ఢిల్లీలో ఏకంగా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలో ఆరోగ్యరంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా నిధులు కేటాయించలేదని నివేదకలు వెల్లడిస్తున్నాయి. అందుకే గత ఏడాది కరోనా సోకినా కూడా ఇప్పటికి ఏడాది దాటినా కూడా దేశంలో పరిస్థితులు మారలేదన్న విషయం ప్రస్తుత సంక్షోభాన్ని బట్టి అర్థమవుతోంది.

ఇప్పటికీ దేశంలో 68శాతం మందికి ఇంకా కనీస ఔషధాలు అందుబాటులో ఉండడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏడాది తర్వాత కూడా ఇంకా దేశంలో ఆస్పత్రి పడకల కోసం .. ఆక్సిజన్ కోసం.. మందుల కోసం.. రెమిడెసివర్ వంటి ఇంజక్షన్ల కోసం జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది.చివరకు మరణాల రేటు కూడా 10.2 శాతం పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 162 ఆక్సిజన్ ప్లాంట్లలో కేవలం 33 మాత్రమే నెలకొల్పామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

కరోనా తొలి విడత కంటే రెండో విడత మరింత ఉధృతంగా వచ్చింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మరోసారి పడక తప్పదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో సేవల రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని.. ఆర్థిక కార్యకలాపాలపై పరోక్ష ప్రభావం చూపి ఆర్థిక అనిచ్చితికి దారితీయవచ్చునని నీతి అయోగ్ హెచ్చరించింది.మరోసారి ప్యాకేజీని కేంద్రం ప్రకటించడం కష్టమేనని.. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రం ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో లేదు. దీంతో ఆర్థిక విపత్తుతోపాటు ఆరోగ్య విపత్తును కూడా రెండో విడతలో దేశ ప్రజలు ఎదుర్కోవాలి.