Begin typing your search above and press return to search.

కాళేశ్వరానికి భారీ నష్టం జరిగిందా?

By:  Tupaki Desk   |   20 July 2022 2:30 AM GMT
కాళేశ్వరానికి భారీ నష్టం జరిగిందా?
X
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన పంప్ హౌస్ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీనివల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన పడుతున్నారు. లక్ష్మీపంప్ హౌస్ లో 17 మోటార్లున్నాయి. ఇవన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.

ఇక్కడ సమస్య ఏమిటంటే వరదనీటిలో మునిగిపోతే పెద్ద నష్టం రాదు. కాకపోతే రక్షణ గోడ శకలాలు, భారీ క్రేన్, ఇనుప గేట్లు తదితరాలు మోటార్లుపై పడి పూర్తిగా దెబ్బతిన్నాయోమేనని నిపుణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

200 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పు, 360 అడుగుల లోతులో కాళేశ్వరం పంప్ హౌస్ నిర్మించారు. ఇందులో 17 భారీ మోటార్లను బిగించారు. వరద దెబ్బకు ఇపుడీ పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది.

నీటిని తోడేయాలన్నా కూడా పెద్ద కష్టమే. నీటిని తోడితే కానీ మోటార్లు బయటపడవు. మోటార్లు బయటపడితే కానీ వాటి పరిస్ధితేంటో తెలీదు. వరద, భారీ వర్షాల కారణంగా ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపేసింది. ఇపుడు నీటిని తోడాలంటే బయటనుండి జనరేటర్లను ఏర్పాటుచేయాలి.

జనరేటర్లు రన్ చేస్తే ఏమి సమస్య వస్తుందే అని టెన్షన్ మొదలైంది. ఉన్న మోటార్లలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. అలాంటిది 17 మోటార్లపైన రక్షణ గోడ కూలిపోవటం, పెద్ద పెద్ద బండరాళ్ళు పడటం, ఇనుప గేట్లు ఊడిపోయి లోపలకు పడిపోవటం కారణంగా మోటార్లు దెబ్బతినుండచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

ఈ మోటార్లన్నింటినీ ప్రభుత్వం జర్మనీ నుండి తెప్పించిందంటున్నారు. మోటార్లు గనుక దెబ్బతింటే వీటిని రిపేర్లు చేసేందుకు ఇంజనీర్లను కూడా అక్కడి నుండి తెప్పించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిన రక్షణ గోడ నాణ్యత నాసిరకంగా ఉండటం వల్లే సమస్యలు మొదలయ్యాయట. దీనిపైనే కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీయార్ ను టార్గెట్ చేశారు. దీన్ని డైవర్ట్ చేయటానికే కేసీయార్ క్లౌడ్ బరస్ట్ అంటు డైవర్షన్ పాలిటిక్స్ ఎత్తుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.