Begin typing your search above and press return to search.

బ్లడ్ ​గ్రూప్ ​కు షుగర్​ కు లింక్​ ఉందా? కొన్ని బ్లడ్​ గ్రూప్స్​ కు ఎక్కువొస్తుందా?

By:  Tupaki Desk   |   17 March 2021 11:30 PM GMT
బ్లడ్ ​గ్రూప్ ​కు షుగర్​ కు లింక్​ ఉందా?  కొన్ని బ్లడ్​ గ్రూప్స్​ కు ఎక్కువొస్తుందా?
X
ఇవాళ దేశంలోని కొన్ని కోట్ల మందిని పట్టి పీడిస్తున్న సమస్య ‘షుగర్’ (డయాబెటిస్​)​. దాదాపు 7 కోట్ల మంది మనదేశంలో షుగర్​ తో బాధపడుతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. షుగర్​ ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే దీర్ఘకాలంపాటు మందులు వాడాల్సిందే. అయితే ఆహారపు అలవాట్లలో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవడం - ప్రతిరోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించడం ద్వారా షుగర్ ​ను దూరం చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. అయితే లైఫ్ ​స్టయిల్​ డిసీజ్​ అయిన షుగర్​ కొన్ని బ్లడ్​ గ్రూప్స్​ వాళ్లకు ఎక్కువగా మరికొన్ని బ్లడ్ ​గ్రూప్స్​ వాళ్లకు తక్కువగా వస్తుందా? దీనిపై వైద్యులు - శాస్త్రవేత్తలు ఏమంటున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం..

‘ఓ’ బ్లడ్​ గ్రూప్ ​వారికి షుగర్​ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట. అదే నాన్​ ఓ బ్లడ్​ గ్రూప్స్​ వాళ్లకు షుగర్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. పలు పరిశోధనల్లో ఈ విషయం తేలింది. 2014లో డయాబెటోలాజియాలోని ప్రచురించబడిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జర్నల్ .. 80 వేల మంది మహిళలో బ్లడ్ గ్రూప్స్ వారిగా టైప్ 2 డయాబెటిస్‏ ను గుర్తించారు.

ఇందులో 3553 మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే అందులో నాన్ బ్లడ్ ఓ గ్రూప్ ఉన్నవారికే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా వెల్లడైంది.ఈ అధ్యయనం ప్రకారం ‘ఓ’ బ్లడ్​ గ్రూప్​ ఉన్నవాళ్లతో పోలిస్తే .. ‘ఏ’ బ్లడ్​ గ్రూప్ ఉన్నవాళ్లకు డయాబెటిస్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. O బ్లడ్ గ్రూప్ తో పోలీస్తే.. బి బ్లడ్ గ్రూప్ ఉన్న స్త్రీలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.

ఎందుకు ఇలా జరుగుతుంది?

రక్తంలో చక్కెర శాతాన్ని అధికం చేసే నాన్ ​విల్లెబ్రాండ్ అనే ఓ రకమైన ప్రోటీన్​ నాన్​ ఓ బ్లడ్​ గ్రూప్​ వాళ్లలో ఎక్కువగా ఉంటుందని అందుకే వాళ్లలో షుగర్​ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి మరిన్న పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.