Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ పై కొత్తతరహా యుద్ధం చేస్తోందా ?

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:15 AM GMT
ఉక్రెయిన్ పై కొత్తతరహా యుద్ధం చేస్తోందా ?
X
దాదాపు ఏడుమాసాల నుండి ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధంలో రష్యా కొత్త తరహా పద్దతిని అనుసరిస్తోందా ? అవుననే మండిపోతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇంతకీ కొత్తతరహా యుద్ధం ఏమిటంటే సూసైడ్ ద్రోన్లతో రష్యా దాడులు చేస్తోందట. ఇప్పటికి సుమారు 150 సూసైడ్ డ్రోన్లను తమపై ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇంతకీ ఈ సూసైడ్ ద్రోన్లు ఏమిటంటే మామూలు డ్రోన్ల కే బాంబులు పెట్టి రష్యా పేల్చేస్తోందట.

తాము టార్గెట్ చేయాలని అనుకున్న ప్రాంతాల్లో రష్యా బాంబులతో కూడిన ద్రోన్లను ల్యాండ్ చేస్తోందట. వెంటనే ఆ డ్రోన్లను రిమోట్ కంట్రోలర్ తో పేల్చేస్తోంది. దీనివల్ల టార్గెట్ల దగ్గర భారీగా పేలుళ్ళు సంభవించి మరణాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయట. టెక్నీషియన్లు ఎక్కడో కూర్చుని ద్రోన్ల సూసైడ్ బాంబులను పేలుస్తున్న కారణంగా రష్యా తరపున ఎలాంటి ప్రాణినష్టం జరగటంలేదు. కానీ ఉక్రెయిన్లో మాత్రం భారీ నష్టం జరుగుతోంది.

ఉక్రెయిన్లోని విద్యుత్ స్టేషన్లు, గ్యాస్ స్టేషన్లు, మంచినీటి సరఫరా వ్యవస్థలపై రష్యా గురిపెట్టిందట. వీటిని టార్గెట్ చేసుకుని సూసైడ్ ద్రోన్ బాంబులతో పేల్చేస్తున్న కారణంగా విద్యుత్, మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న కారణంగా జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నట్లు జెలెన్ స్కీ చెప్పారు. ఖర్కీవ్ పట్టణంలోని తూర్పు ప్రాంతంలో పారిశ్రామికవాడలో ఒకవైపు 8 రాకెట్లతో విధ్వంసం సృష్టిస్తునే మరోవైపు సూసైడ్ డ్రోన్లను పేల్చేస్తున్నది.

రష్యా అవసరాల కోసం ఇరాన్ వేలసంఖ్యలో ద్రోన్లను సరఫరా చేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు తాను అమెరికా, మిత్రపక్షాల నుండి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను అందుకుంటునే రష్యాకు అవసరమైన డ్రోన్లను ఇరాన్ సరఫరా చేస్తోందని గోల చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. గడచిన వారం రోజుల్లోనే ఉక్రెయిన్ పై రష్యా సుమారు 150 సూసైడ్ డ్రోన్లను ప్రయోగించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.