Begin typing your search above and press return to search.

వైజాగ్ లో భారీ సదస్సుకు ప్లాన్ జరుగుతోందా ?

By:  Tupaki Desk   |   9 Aug 2022 6:30 AM GMT
వైజాగ్ లో భారీ సదస్సుకు ప్లాన్ జరుగుతోందా ?
X
వచ్చే ఫిబ్రవరిలో వైజాగ్ లో భారీ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన టార్గెట్ గా అంతర్జాతీయస్ధాయిలో పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్ సంస్ధలను ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మూడురోజుల పాటు నిర్వహించాలని అనుకుంటున్న ఈ సదస్సులో ముందు జాతీయస్ధాయిలో ప్రముఖ కంపెనీలను, తర్వాత అంతర్జాతీయంగా బాగా పాపులర్ కంపెనీలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయమైంది.

తమ సదస్సు విజయవంతమయ్యేందుకు సహకరించాలని ఢిల్లీలోని ఇన్వెస్ట్ ఇండియా విభాగాన్ని రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన రిక్వెస్ట్ చేశారు. దేశంలోకి విదేశీపరిశ్రమలు ఏవిరావాలన్నా ముందుగా సమాచారం అందేది ఇన్వెస్ట్ ఇండియా విభాగానికే.

ఈ విభాగం కేంద్రంలోని భారీ పరిశ్రమల శాఖలోని పెట్టుబడులు, ట్రేడ్ అండ్ ప్రమోషన్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. సో ఈ విభాగంతో అనుసంధానమవ్వటం ద్వారా అంతర్జాతీయ స్ధాయిలోని పరిశ్రమలను ఆకర్షించవచ్చని ప్రభుత్వం అనుకుంటున్నది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి పెట్టుబడుల ఆకర్షణకు ఎలాంటి సదస్సులు నిర్వహించలేదు. ఇదే విషయమై ఈమధ్యనే దావోస్ లో జరిగిన మూడురోజుల సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే జాతీయస్ధాయిలోని కొందరు పరిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. నెల్లూరు, శ్రీసిటి, కాకినాడ, రాజమండ్రి, కడప, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కొన్ని మధ్యతరహా, కొన్ని భారీ పరిశ్రమల యూనిట్లు శంకుస్ధాపనలు చేసుకోవటమో లేకపోతే ఉత్పత్తిని ప్రారంభించటమే చేశాయి.

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా హైలైట్ చేసుకోవచ్చని జగన్ భావించినట్లున్నారు. అందుకనే ఒకవైపు ఇన్వెస్ట్ ఇండియాతో టైఅప్ చేసుకుంటునే మరోవైపు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సుకు ప్లాన్ చేస్తున్నారు.

ఒకటిరెండునెలల్లో జగన్ తన క్యాంపాఫీసును వైజాగ్ లో ఏర్పాటుచేసుకుని వారంలో మూడురోజులు అక్కడే ఉండబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి తన పాలనకు అన్నీవిధాలుగా అనువుగా ఉంటుందనే వైజాగ్ పై దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది.