Begin typing your search above and press return to search.
‘పద్మ’ అవార్డుల్లోనూ రాజకీయ కోణమా?
By: Tupaki Desk | 26 Jan 2021 3:30 PM GMTకాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం దిగ్గజాలు.. అతిరథ మహారథులకే 'పద్మ' అవార్డులు ఇచ్చేది.బీజేపీ అధికారంలోకి వచ్చాక మారు మూల పల్లెలో సైతం జాతి అభ్యున్నతికి పాటుపడ్డ వారికి ఈ పద్మ పురస్కారాలు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఇది గాడితప్పి బీజేపీకి అనుకూలురు.. జాతీయ వాదులకు ఇవ్వడం ప్రారంభించడంతో అభాసుపాలవుతోంది.ఆయా రంగాల్లో నిష్ణాతులైన, విశేషంగా సేవ చేసిన వారికి ఈ పద్మ పురస్కారాలు ఇస్తుంటారు. కానీ రానురాను ప్రభుత్వ పెద్దల అనుగ్రహం ఉంటే చాలు దేశంలో పురస్కారాలు దక్కుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవార్డులు పొందిన వారిలో అనేకమంది రాజకీయ నేతలు ఉండడమే ఇందుకు కారణం. మాజీ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్, సుమిత్రా మహాజన్, కేశూభాయ్ పటేల్, తరుణ్ గోగోయ్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే లాంటి వాళ్లకు ఈ పురస్కారాలు అందడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. వీళ్లంతా రాజకీయ నేతలని.. వీళ్లు ప్రజలకు విశేషమైన సేవలు పెద్దగా చేసిందేమీ లేదని ఇప్పటికే నెటిజన్లు,పలువురు ఆడిపోసుకుంటున్నారు. అయితే దీనిపై వస్తున్న విమర్శలకు కేంద్రం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి మరీ..