Begin typing your search above and press return to search.

వీహెచ్ వలన కాంగ్రెస్ కు ఏమైనా లాభం ఉందా?

By:  Tupaki Desk   |   13 April 2021 2:30 AM GMT
వీహెచ్ వలన కాంగ్రెస్ కు ఏమైనా లాభం ఉందా?
X
కాంగ్రెస్ ను ఎవరో ముంచాల్సిన పనిలేదు. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారని రాజకీయవర్గాల్లో ఓ టాక్ ఉంది. కురువృద్ధ పిండాలు కాంగ్రెస్ ను పట్టి యువ నేతలను ఎదగకుండా తొక్కేస్తున్నారని.. వారంతా ఇతర పార్టీలు పెట్టో.. లేదంటే వేరే పార్టీలోకి చేరిపోయి కాంగ్రెస్ ఈ దుస్థితికి రావడానికి సీనియర్ జంబూకాలే కారణం అన్న టాక్ ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ అలాంటి వృద్ధ పిండాలున్నాయట..

ఆయన పేరు చెబితే వివాదాలు ముసురుకుంటాయి.. ఆయన ‘ఏందిర బై’ ఇది అంటే మీడియా షేక్ అవుతుంది.. అదో వైరల్ వార్త అవుతుంది. ఆ సీనియర్ నేత పక్కా తెలంగాణ యాసలో తిడుతుంటే చూసేందుకు ముచ్చటేస్తుంది. ఆయన మరెవరో కాదు.. మన వీ. హనుమంతరావు. తెలంగాణ కాంగ్రెస్ లో మీడియాకు హాట్ న్యూస్ ఇచ్చే సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది మన వీహెచ్ తాతనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అప్పుడెప్పుడో 1989లో ఒకసారి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి కూడా నిర్వహించారు మన వీహెచ్. ఒకసారి పీసీసీ ప్రెసిడెంట్ కూడా చేశారు. అయితే ఆయన వలన పార్టీ మాత్రం అభివృద్ధి చెందింది లేదనే అపవాదు కాంగ్రెస్ లో ఉంది. ఎందుకంటే అప్పుడాయన ఉండేది హిమాయత్ నగర్ నియోజకవర్గం. ఇప్పుడది అంబర్ పేట నియోజకవర్గంగా మారింది. కానీ 1994 తర్వాత 2-3 సార్లు పోటీచేస్తే వీహెచ్ దారుణంగా ఓడిపోయాడు. కొందరు వీహెచ్ కు డిపాజిట్ కూడా రాలేదు అని అంటారు. కానీ వచ్చిందని సమాచారం. అయితే అగ్రకులాలు అంటే పడని నేత వీహెచ్ అని.. ఎవరైనా కాంగ్రెస్ లో ఎదిగితే అతడు ఓర్చుకోలేడు అన్న విమర్శ ఉంది.

అప్పుడు వైఎస్ఆర్ తో ఇలానే గొడవ పెట్టుకొని అతడికి ఏమీ లేకుండా చేసుకున్నాడని.. ఏదో గాంధీ కుటుంబంకు నమ్మినబంటుగా ఉన్నాడని 2 సార్లు రాజ్యసభ ఎంపీని చేశారట..

వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ మీద ఫిర్యాదు చేసి పార్టీలో లేకుండా చేసిన వ్యతిరేకుల్లో వీహెచ్ ఒకరు అని అంటుంటారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా పార్టీలో తొక్కేసే సీనియర్లలో వీహెచ్ ముందున్నాడని చెబుతున్నారు. రేవంత్ కనుక పార్టీలో నుంచి బయటకు వెళితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని.. వీహెచ్ లాంటి నేతల వలన తెలంగాణలో కాంగ్రెస్ లో మంచి నేతలు లేకుండా పోతున్నారని యువ కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం సమాజంలో 45శాతం యూత్ ఉన్న ఓటర్లలో అసలు వీహెచ్ అంటే ఎవరూ కూడా తెలియదు అని..అదే రేవంత్ రెడ్డి అంటే తెలియని వాళ్లు లేరు అని టాక్. ఈ విషయాన్ని గ్రహించని వీహెచ్ మాత్రం రేవంత్ రెడ్డి మీద విరుచుకొని పడుతున్నాడని కాంగ్రెస్ వాదులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు కేసీఆర్ తర్వాత అత్యంత క్రేజ్ ఉన్న లీడర్ రేవంత్ రెడ్డి అని అంటున్నారు. వీహెచ్ వలన పార్టీకి నష్టం తప్పితే లాభం లేదు అని కాంగ్రెస్ వాదులే అంటున్నారట..