Begin typing your search above and press return to search.

పీకే స్టేట్‌మెంట్‌తో ఏపీకి అప్పులు పుట్ట‌డం లేదా?

By:  Tupaki Desk   |   23 April 2022 1:31 PM GMT
పీకే స్టేట్‌మెంట్‌తో ఏపీకి అప్పులు పుట్ట‌డం లేదా?
X
అప్పులపై ఆధార‌ప‌డి పాల‌న చేస్తున్న ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు.. తాజాగా అప్పులు కూడా పుట్ట‌డం లేదు. రాష్ట్రంలో ఆదాయం అస‌లు అడుగంటింది. ప‌న్నుల‌పై ప‌న్నులు వేస్తూ.. రాబ‌ట్టుకుంటున్న రాబ‌డి సాధార‌ణ ఖ‌ర్చుల‌కు స‌రిపోతోంది. అయితే.. జీతాలు.. భ‌త్యాలు.. పింఛ‌న్లు.. కొత్త ప‌థ‌కాలు.. సంక్షేమం.. వంటివాటిని అమ‌లు చేసేందుకు వేల కోట్ల రూపాయ‌లు కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఏనెల‌కు ఆ నెల‌.. అప్పులు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగాఅప్పుల కోసం.. ప్ర‌య‌త్నించిన ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ప‌చ్చ‌జెండా ల‌భిం చ‌లేద‌ని తెలిసింది. దీంతో ఆర్థిక శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ఎస్ .ఎస్‌. రావ‌త్ ఢిల్లీ నుంచి తిరుగుముఖం ప‌ట్టారు. కానీ, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మాత్రం అక్క‌డే ఉండి.. ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయి తే.. ఇలా.. కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం వెనుక‌.. కార‌ణాలు ఏమై ఉంటాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిశోర్‌.. ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ఇచ్చారు.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మొత్తం 17 రాష్ట్రాల్లో బ‌లంగా పోటీ చేయాల‌ని.. పీకే సూచించారు. అంతేకాదు.. 377 స్థానాల‌ను టార్గెట్ గా పెట్టుకోవాల‌ని కూడా సూచించారు. అంటే..వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు త‌న‌దైన శైలిలో పీకేసూచ‌న‌లు చేశారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్న చోట్ల‌.. ఆయా ప్రాంతీయ పార్టీల‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే బెట‌ర్ అని.. కూడా పీకే సూచించిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే.. ఏపీలో బ‌ల‌మైన పార్టీగా.. ఉన్న వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బెట‌ర్ అని పీకే సూచించిన‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు... కూడా.. బీజేపీతో జ‌గ‌న్ ప‌రోక్షంగా క‌లిసే చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ.. బీజేపీ అనుకూల రాజ‌కీయాలే ఆయ‌న చేశారు. అలాంటి జ‌గ‌న్‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించేందుకు.. బీజేపీ కూడా అప్పులు ఇస్తోంది. ఎంత అప్పులు తీసుకున్నా.. మౌనంగా ఉంటోంది.

అయితే.. ఇప్పుడు పీకే చేసిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ కార‌ణంగా.. వైసీపీపై బీజేపీకి సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు. అంటే.. కాంగ్రెస్‌కు వైసీపీకి చేరువ అయితే.. ప‌రిస్థితి ఏంట‌నేది బీజేపీ అనుమానం కావొచ్చు. ఈ నేప‌థ్యంలోనే సాధార‌ణంగా.. ప్ర‌తి శుక్ర‌వారం ఏపీ అభ్య‌ర్థ‌న మేర‌కు అప్పులు ఇచ్చే.. కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ సారి ప‌క్క‌న పెట్టింది. అస‌లు ప‌ట్టించుకోలేదు.

కొత్త అప్పులకు అనుమతి కోసం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్‌ రావత్‌ వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినా నిరాశే ఎదురైంది. శుక్రవారం నాటికి ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో రావత్‌ తిరిగి విజయవాడ వచ్చేశారు. కొత్త అప్పులకు అనుమతిచ్చేందుకు వీలుగా కేంద్రం అడిగిన వివరాలన్నీ ఆర్థికశాఖ అధికారులకు బుగ్గన, రావత్‌ సమర్పించినట్టు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రం ఏపీ విష‌యంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వెనుక‌.. సోనియాకు.. పీకే చేసిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌నే రీజన్ అనిఅంటున్నారు ప‌రిశీల‌కులు.