Begin typing your search above and press return to search.

టీడీపీకి మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వా..?

By:  Tupaki Desk   |   27 May 2021 12:30 PM GMT
టీడీపీకి మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వా..?
X
ఎన్నిక‌ల‌కు మూడేళ్ల ముందు టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రూ చూస్తున్నారు. ప్ర‌తి విషయంలోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డా స‌ర్కారు ప‌ట్టించుకుంటున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. పైగా ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా.. త‌మ‌కుఅనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే అవి కూడా పెద్ద‌గా స‌క్సెస్ కావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌లు మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ‌గ్గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీని మ‌రింత‌గా ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎన్నిక‌ల‌కు యేడాది ముందే టీడీపీపి పూర్తిగా ఖాళీ చేసేలా వైసీపీ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వైసీపీ నాయ‌క‌త్వం చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది. టీడీపీకే చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం వైసీపీ గూటికి చేరిపోయారు. మ‌రో న‌లుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులు లీకులు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే యేడాదిన్న‌ర‌లో
మ‌రింత మంది టీడీపీ నేత‌ల‌ను త‌మ పార్టీవైపు ఆక ర్షించ‌డమే కాకుండా.. టీడీపీకి సంబంధించి ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీయాల‌నేది కూడా వైసీపీ వేస్తున్న వ్యూహాల్లో ఒక‌టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే చాలా మంది టీడీపీ నేత‌లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. మ‌రికొంద‌రు పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపించ‌డం మానుకున్నారు. ఏదో మొక్కుబ‌డిగా పార్టీ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు త‌ప్ప‌.. మ‌న‌స్పూర్తిగా ఎవ‌రూ పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు చేసేందుకు ముందుకు రావ‌డంలేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎంత మంది పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తారు? పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉంటారు? అనే చ‌ర్చ సాగుతోంది. పైగా చంద్ర‌బాబు సైతం.. ఇదే ఆఖ‌రి ఛాన్స్ అనే కామెంట్‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లే యోచ‌న‌లో ఉన్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. అయితే.. ఎంత ఆఖ‌రి చాన్స్ అయినా.. ప్ర‌జ‌లు ఇవ్వాల‌ని గ్యారెంటీ ఏమీ ఉండ‌దు.

అటు లోకేష్ నాయ‌క‌త్వం ఇంకా నిరూపణ కాలేదు. అలాంటి సందర్భాలు తగినన్ని రాలేదు. మరోవైపు నంద‌మూరి ఫ్యామిలీకి ముందుకు తీసుకు రావాల‌న్న పార్టీ కేడర్ విజ్ఞ‌ప్తిని చంద్ర‌బాబు వినీవిననట్టు ఉంటున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే టీడీపీకి మ‌రిన్ని ఇక్క‌ట్లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.