Begin typing your search above and press return to search.

ఏపీకి రాజ‌ధాని లేన‌ట్టేనా? పిల్ల‌ల‌కు ఏం చెబుతారు?

By:  Tupaki Desk   |   13 Feb 2022 2:30 AM GMT
ఏపీకి రాజ‌ధాని లేన‌ట్టేనా?  పిల్ల‌ల‌కు ఏం చెబుతారు?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని పేరేమి?`- అని రాష్ట్రంలో చ‌దువుతున్న విద్యార్థుల‌ను ఎవ‌రిని అడిగినా.. నీళ్లు న‌మ‌లుతున్నారు. దీనికి కార‌ణం.. వారుచ‌దువుతున్న పాఠ్యాంశాల్లో కానీ.. రాష్ట్ర మ్యాపులో కానీ.. రాజ‌ధాని ని పేర్కొన‌క‌పోవ‌డ‌మే! ఇది చిత్రంగా ఉన్నా.. నిజం. నాలుగోత‌ర‌గ‌తి పాఠ్యాంశాల నుంచి .. విద్యార్తుల‌కు మ్యాపులు, రాష్ట్రాలు, రాజ‌ధానుల అంశాన్ని నేర్పిస్తున్నారు. అయితే.. మ‌న‌రాష్ట్రంలో మాత్రం.. ఈ అంశాన్ని ప‌క్క‌న పెట్టారు. విద్యార్తుల‌కు రాజ‌ధాని ఏది అంటే.. స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితిని క‌ల్పించారు.

నాలుగో త‌ర‌గ‌తి సోష‌ల్ పుస్త‌కంలో ప్ర‌చురించిన ఇండియా మ్యాప్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని చూపించ లేదు. తెలుగు మాధ్య‌మానికి సంబంధించి తయారుచేసిన ఈ పుస్త‌కంలో రాష్ట్ర రాజ‌ధాని చూపించ‌క‌పో వ‌డంతో విద్యార్థుల‌కే కాదు టీచర్లకూ అయోమయంగా ఉంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రచురించిన ఈ పుస్త‌కం చివ‌ర్లో భార‌త‌దేశ చిత్ర ప‌టం పొందుప‌రిచారు. దాంట్లో అన్ని రాష్ట్రాల రాజ‌ధా నుల‌నూ విద్యార్థుల‌కు అర్థం అయ్యే విధంగా మ్యాప్ పాయింట్ ఇచ్చారు. కానీ ఏపీ ద‌గ్గ‌ర వ‌దిలేశారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని అంటే.. అమ‌రావ‌తి అంటూ..చిన్నారులు చ‌దువుకున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత మూడురాజ‌ధానులు అని తెర‌మీద‌కి తెచ్చారు. అయితే.. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు సా ధ్యం కాలేదు. అయినా.. ఒక రాస్ట్రానికి మూడు రాజ‌ధానులు ఏమిట‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రో వై పు రాజ‌ధాని రైతుల ఉద్య‌మం.. కేసులు కోర్టుకు వెళ్ల‌డం.. ఉద్య‌మం తీవ్రం కావ‌డంతో.. మూడు రాజ‌ధాను ల విష‌యాన్ని ప్ర‌బుత్వం వెన‌క్కి తీసుకుంది.

అయిన‌ప్ప‌టికీ.. వెన‌క్కి త‌గ్గేదేలే! అంటూ.. మ‌ళ్లీ మూడు రాజ‌ధానులు తీసుకువ‌స్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క టించారు. ఇక‌, రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న వ‌స్తే.. అధికార పార్టీకి చెందిన వారుకూడా... మూడు రాజ‌ధానులు అని పైకి చెబుతున్నా.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో మాత్రం త‌ల‌బాదుకుంటున్న ప‌రిస్థితి వ‌స్తోంది. అయినా.. ఏదో ఒక రాజ‌ధాని ప్ర‌క‌టించేస్తే.. ఈ గోల త‌ప్పుతుంది క‌దా! అనేవారు కూడా ఉన్నారు. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం మూడు రాజధానులే అంటూ.. పాత క‌థ‌లే వ‌ల్లిస్తోంది.

దీంతో ఇటు పాఠ్యాంశాల్లో పిల్ల‌ల‌ను ఒప్పించ‌లేక‌.. అటు.. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు.. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు ఎదురీద‌లేక‌.. తిప్ప‌లు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి దీనిపై ఉగాది నాటికి తుది రూపు తీసుకువ‌స్తామ‌ని.. మంత్రి కొడాలి నాని సాక్షాత్తూ ప్ర‌క‌టించారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.