Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ రేసులో ‘కారు’ లేదట.. కారణం అదేనా..?
By: Tupaki Desk | 13 Feb 2021 12:30 PM GMTఎన్నికలు వస్తున్నాయంటే.. అధికార పార్టీ హడావిడి మామూలుగా ఉండదు. ఆ కథ వేరే ఉంటది. వ్యూహ రచనలు.. సమావేశాలు.. సంప్రదింపులు.. అబ్బబ్బో.. ఆ హంగామా చెప్పలేం. కానీ.. ఎన్నికలు వస్తుంటే అధికార పార్టీ స్తబ్దుగా ఉంటే..? ఆ ఎలక్షన్ ను పట్టించుకోకపోతే..? అసలు బరిలోనే నిలవకపోతే..? ఇదేదో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే! అవును.. రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ బరిలో నిలవట్లేదట! ఇదే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న అంశం.
శాసనమండలిలో మార్చి 29న రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టులు ఖాళీ అవుతున్నాయి. దీంతో.. ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు కూడా విడుదల చేసింది. ఆ రెండిట్లో.. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం ఒకటి కాగా.. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’నియోజకవర్గం రెండవది.
ఇందులో.. మొదటి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్‌ఎస్. కానీ.. రెండో స్థానం గురించి మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. విషయమేంటని పట్టుబట్టి కీలక నేతలను అడిగితే.. ఒకటీరెండు రోజుల్లో చెప్తామని దాటవేస్తున్నారట. అయితే.. అసలు విషయం ఏమంటే.. ఈ సారి పోటీకి దూరంగా ఉండాలని భావిస్తోందట టీఆర్‌ఎస్ అధిష్టానం!
‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’నియోజకవర్గానికి 2007, 2009, 2015లో ఎన్నిక జరిగింది. ఇందులో రెండుసార్లు టీఆర్ ఎస్ ఓడిపోగా.. 2009లో మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఎన్నిక జరుగుతోది. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవ్వగా.. 2009లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్ మద్దతునిచ్చింది. ఆయన విజయం సాధించారు. 2015లో టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి టీఆర్‌ఎస్ తరపున బరిలోకి నిలిపినా విజయం దక్కలేదు.
ఇప్పటికే.. అటు దుబ్బాకలో ఓటమి ఎదురైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ భారీగా పుంజుకుంది. ఈ రెండు ఫలితాలకే కాషాయదళ నేతలు నేలమీద ఆగట్లేదు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోయినా.. టీఆర్ఎస్ ఓడిపోతే ప్రభుత్వ వ్యతిరేకగా ప్రచారం చేస్తుందనే భయం గులాబీ నేతల్లో ఉందని సమాచారం. అందుకే.. పోటీ చేసి ఓడిపోవడం కన్నా, పోటీకి దూరంగా ఉంచడమే మేలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.
అయితే.. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాత్రం అభ్యర్థులు ఉత్సాహంగానే ఉన్నారట. టీఎస్‌ఎడబ్ల్యూడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పీఎల్ శ్రీనివాస్, శుభప్రద్ పటేల్ తదితరులు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కానీ.. పోటీ చేయకుండా.. మరోసారి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందట అధిష్టానం. మరి, ఫైనల్ గా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. కాగా.. ఈ నెల 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. మార్చి 14న పోలింగ్ నిర్వహించి, 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.