Begin typing your search above and press return to search.
ప్రధాని హెచ్చరించినా ఏపీ బీజేపీ నేతల్లో మార్పు లేదా?
By: Tupaki Desk | 15 Nov 2022 10:36 AM GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ బీజేపీ నేతలతో దాదాపు గంటన్నర పాటు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ స్థితిగతులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అధికార పార్టీపై పోరాటం తదితర విషయాల్లో ప్రధాని మోడీ ఏపీ బీజేపీ నేతలకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చార్జిషీట్లు రూపొందించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని నేతలకు సూచించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
ఒకప్పుడు గుజరాత్, కర్ణాటక, ఏపీల్లో పార్టీ పరిస్థితి ఒకేలా ఉండేదని.. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉందని మోడీ గుర్తు చేశారు. ఏపీలో మాత్రం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాలేదని.. పార్టీ పటిష్టానికి కృషి చేయాలని ఆదేశించారు.
పక్షపాతం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని మోడీ తెలిపారు. వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు. అదేవిధంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ అవినీతి, లోపాలు తీవ్రస్థాయిలో ఎండగట్టాలని కోరారు. రాజకీయాల్లో నిత్యం వేగంగా ఉండకపోతే మన స్థానాన్ని మరొకరు ఆక్రమించేస్తారని హెచ్చరించారు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా స్థానిక సమస్యలు, పరిష్కారం కోసం నిత్యం గళమెత్తుతూనే ఉండాలని బీజేపీ శ్రేణులకు స్పష్టమైన కార్యాచరణను సూచించారు.
అయితే ప్రధాని మోడీ స్పష్టమైన కార్యాచరణ, దిశానిర్దేశం చేసినప్పటికీ ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. ఏపీ బీజేపీలో ఉన్న కొందరు నేతలు ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ కోవర్టులని కొందరు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు టీడీపీ కోవర్టులని మరో వర్గం ఆరోపిస్తోందని అంటున్నారు.
దీంతో వైసీపీపై పైపై విమర్శలకే తప్ప సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు తదితరులు ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇందుకు వైసీపీ సహాయ సహకారాలు ఆయన అర్ధిస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎల్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు ముందుకు రావడం లేదని అంటున్నారు.
ఇక దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ చెంచురామ్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారని టాక్. దీంతో ఆమె చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇక సోము వీర్రాజు.. పవన్ కల్యాణ్‌తో పొత్తు విషయంలో ముందుకెళ్లేలా వ్యవహరించడం లేదని విమర్శలు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు బలోపేతం విషయాన్ని సోము పట్టించుకోవడం లేదని.. ఇదే విషయాన్ని పవన్ సైతం ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారని టాక్ నడుస్తోంది. ఇలా ఏపీ బీజేపీలో ఎవరికి వారే కోవర్టు రాజకీయాలు చేస్తూ పార్టీని దెబ్బతీస్తున్నార నే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.