Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   3 July 2020 6:15 AM GMT
హైదరాబాద్ లో మళ్లీ  లాక్ డౌన్ లేనట్లేనా?
X
ప్రస్తుతం ఏ ఇద్దరు బయట కలిసి మాట్లాడినా ..వారు మాట్లాడే మొదటి మాట హైదరాబాద్‌ లో లాక్‌డౌన్ ఎప్పుడు పెడతారు..? లాక్ డౌన్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయ్..? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. ఇంతకీ హైదరాబాద్‌ లాక్‌ డౌన్‌ ఉంటుందా? వైరస్ ఆంక్షణపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏమిటి? ప్రతి రోజూ సరాసరిగా 800 మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో GHMC పరిధిలో లాక్ ‌డౌన్‌ విధించే అంశం తెరపైకి వచ్చింది.

లాక్‌ డౌన్ మళ్లీ పెట్టే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నామని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్ డౌన్ పై కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనితో ప్రతి ఒక్కరు ఇప్పుడు కేబినెట్ భేటీ ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే, సుదీర్ఘ లాక్ ‌డౌన్‌ తో ఇబ్బంది పడ్డ జనం ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. లాక్‌ డౌన్‌ వల్ల అటు ప్రభుత్వంతో పాటు ఇటు వివిధ రంగాల కార్మికులు కూడా ఆర్థికంగా నష్టపోయారు. అయితే, మళ్లీ లాక్‌ డౌన్ విధిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.

అయితే , మహమ్మారి నియంత్రణకు లాక్‌ డౌన్ ఒక్కటే మార్గమని కొందరంటుంటే మళ్లీ లాక్‌ డౌన్ కారణంగా ఆర్ధికంగా సమస్యలొస్తాయని మరికొందరు చెబుతున్నారు. హైదరాబాద్ ‌లో వైరస్ విజృంభణను ఇప్పటికైనా అడ్డుకోకపోతే మున్ముందు పరిస్థితి పూర్తిగా చేజారిపోయే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ కారణంగానే లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తోంది ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో లాక్ ‌డౌన్‌ ను పొడిగించింది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో కూడా కంటైన్మెంట్‌ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ ‌డౌన్ అమలు చేయనున్నారు. అయితే , కేసులు భారీగా పెరుగుతుండటంతో హైదరాబాద్ ‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. నగరంలో మరోసారి లాక్ డౌన్ పెట్టబోతున్నారు అనే వార్తలు రావడంతో ప్రజలు ఇప్పటికే నెలకి సరిపడా సరుకులు తెచ్చిపెట్టుకున్న. అలాగే కొంతమంది మళ్లీ సొంత ఊర్ల బాట పట్టారు. ముందు జరిగిన ప్రచారాన్ని బట్టి ఈ రోజు నుండి లాక్ డౌన్ మొదలవ్వాలి కానీ అసలు ఆ మాటే వినిపించడం లేదు. దీనితో ఇక హైదరాబాద్ లో కూడా లాక్ డౌన్ లేనట్టేననే వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఈ లాక్ డౌన్ అంశం పై ప్రభుత్వం నుండి ఓక స్పష్టమైన ప్రకటన వచ్చేవరకుదేన్నీ నమ్మలేని పరిస్థితి నెలకొంది.