Begin typing your search above and press return to search.

ఆయ‌న‌తో అవ‌స‌రం లేదా? ఒడిశా సీఎంపై కేసీఆర్ ప్లాన్ ఏంటి?

By:  Tupaki Desk   |   17 Oct 2022 8:39 AM GMT
ఆయ‌న‌తో అవ‌స‌రం లేదా? ఒడిశా సీఎంపై కేసీఆర్ ప్లాన్ ఏంటి?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త‌న ప్రాంతీయ పార్టీ టీఆర్ ఎస్‌ను.. జాతీయ పార్టీగా మార్పు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి.. ఇప్ప‌టికే పార్టీలో తీర్మానం కూడా చేశారు. దీనిని ఎన్నిక‌ల సంఘానికి కూడా పంపించారు.

ఇక‌, జాతీయ స్థాయిలో మెర‌వాల‌ని భావించిన కేసీఆర్ ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూడా కలుసుకున్నారు. వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టారు. కొంద‌రిని హైద‌రాబాద్‌కు పిలుచుకుని.. చ‌ర్చించారు. మ‌రికొంద‌రిని తానే స్వ‌యంగా వెళ్లి మ‌రీ ప‌ల‌క‌రించి వ‌చ్చారు. ఇవ‌న్నీ కూడా.. తాను పెట్ట‌నున్న జాతీయ పార్టీకి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో భాగ‌మే.

ఇలా.. పొరుగునే ఉన్న ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ను సైతం.. కేసీఆర్ క‌లుసుకున్నారు.గ తంలో భువ‌నేశ్వ‌ర్‌కు వెళ్లి మ‌రీ.. ఆయ‌న‌ను క‌లుసుకుని చ‌ర్చించారు. అలాంటి.. కేసీఆర్.. ఎందుకో..ఏమో తెలియ‌దు కానీ.. స్వ‌యంగా ప‌ట్నాయ‌క్ హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంలో ఆయ‌న‌ను క‌లుసుకోలే ద‌ని..

క‌నీసం.. త‌న ఇంటికి కూడా ఆహ్వానించే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని.. అస‌లు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒడిశా సీఎం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు న‌వీన్ ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఒడిశా సీఎం రెండు రోజుల పాటు.. హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. న‌వీన్ ప‌ర్య‌ట‌న‌ను లైట్ తీసుకున్నారు. క‌నీసం.. ఆయ‌న దీనిపై ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. అంతేకాదు.. ఆయ‌న‌కు ఫోన్ కూడా చేసిన‌ట్టు లేరు.

మొత్తానికి ప‌నట్నాయ‌క్‌ను అస‌లు ప‌ట్టించుకోలేదు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల రాష్ట్ర ప‌తి ఎన్నిక‌లో ప‌ట్నాయ‌క్ కేంద్ర పెద్ద‌లు చెప్పిన‌ట్టు న‌డుచుకున్నార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో పైకి బీజీపీ వ్య‌తిరేక నాయ‌కుడిగా.. ప‌ట్నాయ‌క్ పేరు తెచ్చుకున్నా.. ఆయ‌న‌లోనూ ఆర్ ఎస్ ఎస్ భావాలు ఉన్నాయ‌ని అంటారు. ఈ నేప‌థ్యంలోనే న‌వీన్ తో చ‌ర్చించినా ఉప‌యోగం ఉండ‌దని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.