Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో పార్టీ లేదు కదా ? మ‌రి ! వేడుక ఎందుకు బాబూ !

By:  Tupaki Desk   |   30 March 2022 8:30 AM GMT
తెలంగాణ‌లో పార్టీ లేదు కదా ? మ‌రి ! వేడుక ఎందుకు బాబూ !
X
గండిపేట‌లో తొలిసారి కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆరంభం షురూ అయింది. ఆ త‌రువాత ఎన్టీఆర్ భ‌వ‌న్ రోడ్ నంబ‌ర్ 2, బంజారాహిల్స్ లో ఏర్పాటైంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత గుంటూరు కేంద్రంగా కూడా ఎన్టీఆర్ భ‌వ‌న్ ఏర్పాటైంది. గుంటూరుజిల్లా అరండ‌ల్ పేట్ లో ఎన్టీఆర్ భ‌వ‌న్ నెల‌కొల్పారు.

ఈ విధంగా అమ‌రావ‌తిలో కూడా కార్య‌క‌లాపాల‌కు వీలుగా పార్టీ కార్యాల‌య భవంతి ఉన్నా కూడా అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా తెలంగాణ‌కు పోయి వేడుక‌లు ఎందుకు చేశార‌ని?

అంటే ఆ భ‌వంతిని ఎన్టీఆర్ క‌ట్టించారు క‌దా! అందుకే అక్క‌డికి వెళ్లారా లేదా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి కూడా పోటీ చేయాల‌ని టీడీపీ భావిస్తూ అందులో భాగంగా ఈ ఎత్తుగ‌డ వేశార‌ని కూడా అనుకోవాలా?

వాస్త‌వానికి ఇవాళ ఓ ఉప ప్రాంతీయ పార్టీగానే టీడీపీ మిగిలిపోయింది. ఎంత ప్ర‌య‌త్నించినా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చంద్ర‌బాబు నీడ నుంచి త‌ప్పుకోలేరు క‌నుక! అక్క‌డ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా పూర్వ వైభ‌వం ద‌క్కించుకోలేవు.

అదేవిధంగా ఒక‌ప్పుడు బ‌లంగా ఉన్న న‌గ‌ర నాయ‌క‌త్వం అంతా గులాబీ శ్రేణుల్లో క‌లిసిపోయింది 'మ‌రి! అలాంట‌ప్పుడు వేడుక‌లు చేసి ఏం సాధిస్తార‌ని? అమ‌రావ‌తి రాజ‌ధాని కావాల‌ని కొట్లాడుతూ కొట్లాడుతూ ప‌దే ప‌దే అదే మాట చెబుతున్న చంద్ర‌బాబు మాట మార్చి మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని హైద్రాబాద్ నే మ‌రో ప‌దేళ్ల పాటు కొన‌సాగించాల‌ని అడుగుతారా?

లేదా మ‌ళ్లీ కాంగ్రెస్ తో జ‌ట్టుకట్టి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు లాంటి క‌మ్మ లీడ‌ర్ల‌ను ఇటుగా తీసుకువ‌చ్చి కొత్త వ్యూహం ఏమ‌యినా ప్లే చేస్తారా? ఇవే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌లుగానే ఉన్నాయి.