Begin typing your search above and press return to search.
ఏపీలో ఈ సారి వైశ్యులకు మంత్రి వర్గంలో చోటు లేదా?
By: Tupaki Desk | 15 March 2022 8:08 AM GMTఔను..ఇప్పుడు ఈ ప్రశ్నే.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బలమైన ఆర్థిక వర్గంగా.. రాజకీయంగా కూడా పుంజుకున్న వైశ్యులు.. రాష్ట్రంలో సుమారు 12 శాతంగా ఉన్నారు. విజయనగరం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, తిరుపతి.. తదితర జిల్లాల్లో.. వైశ్య సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో నే అన్ని పార్టీలూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ప్రస్తుతం వైసీపీలో ముగ్గురు వరకు వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తు న్నారు.
పార్టీ తరఫున కూడా బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేప థ్యంలో.. వెలంపల్లిని పక్కన పెడతారనే వాదన వినిపిస్తోంది. నిజానికి వెలంపల్లి చూసిన శాఖపై అనూహ్య మైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
దేవాలయాలపైదాడులు, విగ్రహాల విధ్వంసం.. ఇలా.. అనేక రూపాల్లో.. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక, శాఖలోని అధికారులు దాడులు చేసుకుని ఇసుక చిమ్ముకునే పరిస్థితులు కూడా తెరమీదికి వచ్చాయి. అయితే.. ఇంత జరిగినా.. వాటిని ఖండించకపోవడం.. వెలంపల్లి స్టయిల్.
సరే.. ఇప్పుడు విషయం.. మంత్రి గురించి కాదు కనుక.. ఆయన విషయం పక్కన పెడితే.. ఉగాది నాటికి మారే మంత్రి వర్గంలో ఈ సారి వైశ్య సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేదని తెలుస్తోంది. ఎందుకంటే మరో అగ్రవర్ణం.. బ్రాహ్మణులకు మంత్రి వర్గంలో ఇప్పటి వరకు చోటు దక్కలేదు.
దీంతో తదుపరి.. మంత్రి వర్గ విస్తరణలో బ్రాహ్మణ వర్గానికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోందనిఅంటున్నారు. ఈ రేసులో విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన ఇక్కడకీలక నేతలు పోటీ కూడా పడుతున్నారు.
ఇదిలావుంటే, మంత్రి వర్గ కూర్పులో కూడికలు, తీసివేతల లెక్కలను పార్టీ కీలక నాయకుడు.. ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి సహా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్టు సమాచారం. త్వరలోనే వీరు రంగంలోకి దిగి కూడికలు,తీసివేతలపై తమదైన కసరత్తు చేయనున్నారట. అనంతరం.. దీనిని సీఎం జగన్‌కు అప్పగిస్తారు. తుది నిర్ణయం సీఎం జగన్ తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఎవరు ప్లస్సో.. ఎవరు మైనస్సో చూడాలి.