Begin typing your search above and press return to search.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులో అలాంటి పదం ఉందా?
By: Tupaki Desk | 20 Nov 2020 6:30 AM GMTరాజకీయ ప్రత్యర్థులపై ఊహించని రీతిలో విరుచుకుపడే ధోరణి తెలంగాణ రాష్ట్ర అధికారపక్షం సొంతం. వ్యూహాత్మకంగా వ్యవహరించటమే కాదు క్రియేటివిటీతో ప్రత్యర్థులపై పేర్లు పెట్టటం.. ఘాటుగా విరుచుకుపడటం.. వారి లోపాల్ని తెలివిగా ఎత్తి చూపటం.. మొత్తంగా తక్కువ చేసి మాట్లాడుతూ.. చులకన చేయటంలో వారికి వారే సాటి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.
అలాంటి టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం మింగుడుపడని రీతిలోపంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారు తెలంగాణ కమలనాథులు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీని ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పేరులో ఊహించని కొత్త అర్థాన్ని బయటకు తీసిన బండి సంజయ్.. అందరి చూపు తన మీద పడేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. పేరులోని మొదటి అక్షరాల్ని తీసుకొని ‘కచరా’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ పూర్తి పేరులోని మొదటి అక్షరాల్ని తీసుకొని.. తిప్పికొట్టలేని రీతిలో ఫైర్ అయిన వైనం చూస్తుంటే.. కేసీఆర్ కు రానున్న రోజుల్లో ఈ తరహా సవాళ్లు మరిన్ని ఎదురవుతాయన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా కేసీఆర్ అండ్ కోను తమ దూకుడుతో నిలువరించే పార్టీగా బీజేపీ ప్రజల్లో రిజిస్టర్ అవుతోందని చెప్పాలి. ఇప్పటివరకు ఈ తరహా వ్యాఖ్యలు.. దూకుడుగా దూసుకెళ్లిపోవటం టీఆర్ఎస్ నేతల్లో చేశాం. ఇప్పుడు అలాంటి తీరును బీజేపీ నేతల్లో చూడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.