Begin typing your search above and press return to search.

వివేకాను హత్య చేసింది వీళ్లేనా?

By:  Tupaki Desk   |   19 March 2019 4:59 AM GMT
వివేకాను హత్య చేసింది వీళ్లేనా?
X
వైఎస్ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ దాదాపు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. వివేకా హత్య తర్వాత ఏర్పాటు చేసిన సిట్ అన్ని వైపుల నుంచి విచారణ జరుపుతోంది. వివేకా హత్యకు బెంగళూరులోని ఓ భూవివాదమే కారణంగా సిట్ అధికారులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. ఈ మేరకు వివేకా ప్రధాన అనుచరులు పరమేశ్వర్ రెడ్డి, గంగిరెడ్డిల కోసం వేట మొదలుపెట్టారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరైన పరమేశ్వర్ రెడ్డి, ఆయన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పోలీసుల అనుమానాలకు కారణమైంది. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక మరో అనుచరుడు గంగిరెడ్డిని పట్టుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం.

గంగిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఓ భూవివాదంలో సెటిల్ మెంట్ ను రూ.150 కోట్లకు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో 1.5కోట్ల లావాదేవీలు కూడా వైఎస్ వివేకా అకౌంట్లకు చేరినట్లు పోలీసులు గుర్తించారట.. దీంతో ఈ హత్య భూవివాదం నేపథ్యంలోనే జరిగినట్టు అనుమానాలు బలపడుతున్నాయి.

వైఎస్ వివేకా హత్యకు వారం ముందు ఆయన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మరణించడం.. ఆ తర్వాత వైఎస్ వివేకాకు వారం ముందు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ‘బీ అలెర్ట్.. జాగ్రత్తగా ఉండు’ అని మేసేజ్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇక గంగిరెడ్డి కూడా బెంగళూరు భూవివాదం నేపథ్యంలోనే కక్షలు పెరిగి హత్యకు దారితీసిందని చెప్పినట్టు సమాచారం. ఇలా వివేకా హత్యకు ప్రస్తుతానికి బెంగళూరులో ఓ ఖరీదైన రూ.150కోట్ల భూమి వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు పరమేశ్వర్ రెడ్డి దొరికితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.