Begin typing your search above and press return to search.
సుప్రీం ఎందుకంత సీరియస్ అయ్యిందంటే..
By: Tupaki Desk | 17 Jan 2017 5:17 AM GMTగతానికి భిన్నంగా కోర్టులు కాస్త గట్టిగానే స్పందిస్తున్నాయని చెప్పాలి. ప్రభుత్వాల మీదా వ్యాఖ్యలు చేసే సమయంలో కాస్తంత ఆచితూచి వ్యాఖ్యలు ఉండేవని.. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా కాస్తంత ఘాటుగానే కోర్టులు వ్యాఖ్యానిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ వ్యాఖ్యల్లో ధర్మాగ్రహం ఉందని చెప్పక తప్పుదు. తాజాగా ఒక కేసు విచారణ సందర్భంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇది సుప్రీంకోర్టు అనుకుంటున్నారా? జోక్ కోర్టు అనుకుంటున్నారా? అత్యున్నత న్యాయస్థానంతో ఈ పరిహాసాలేంటి? మీ సీఎస్ లను పిలిపిస్తే కానీ సీరియస్ గా స్పందిస్తారా? అంటూ తీవ్ర మండిపాటును ప్రదర్శించిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహంలో ధర్మం ఉందని చెప్పాలి. పలు రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వమే సుప్రీం చేత ఇలాంటి వ్యాఖ్యలు చేసేలా చేసిందని చెప్పాలి.
దాదాపు నాలుగైదేళ్ల కిందట బీహార్ లోని ఒక స్కూల్లో పెట్టిన మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా లేకపోవటంతో 23 మంది చిన్నారులు మరణించారు. ఈ ఉదంతంతో పాటు.. మధ్యాహ్న భోజనం పరిశుభ్రతపై 2013లో అంతర్ రాష్ట్రీయ మానవ అధికార నిగ్రాణీ అనే ఎన్జీవో మధ్యాహ్న భోజనంలో శుభ్రతపై ఒక పిల్ దాఖలు చేసింది. మరో స్వచ్ఛంద సంస్థ పారిశ్రామిక కాలుష్యంపై ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది. ఈ రెండింటిని కలిపి విచారిస్తున్న సుప్రీంకోర్టు.. అయా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం పరిశుభ్రత గురించి ప్రశ్నించటంతో పాటు.. బీహార్ ఉదంతం లాంటివి చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. దీనిపై ఇప్పటివరకూ కౌంటర్ దాఖలు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలు కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడింది.
ఒక కేసులో ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు చేయకపోతే.. ఆ మాత్రం ఆగ్రహం రావటం తప్పులేదనే చెప్పాలి. విషాదకరమైన విషయం ఏమిటంటే.. తమ పాలనలో చితక్కొట్టేస్తున్నామని.. దూసుకెళ్తున్నామని చెప్పుకునే రాష్ట్రాలు సైతం ఈ ఉదంతంలో కౌంటర్ దాఖలు చేయకుండా ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. హర్యానా.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్ తో పాటు మొత్తం 12రాష్ట్రాలు ఇప్పటివరకూరియాక్ట్ కాకపోవటం చూస్తే.. ఒక సున్నిత సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్పందన ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. ఈ అలసత్వమే సుప్రీంకోర్టుకు మండిపోయేలా చేసిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/