Begin typing your search above and press return to search.
మాయదారి రోగంపై కేసీఆర్ విజన్ ఇదేనా?
By: Tupaki Desk | 4 Jun 2020 4:00 AM GMTఇరుగుపొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. మహారాష్ట్ర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కేసులు నమోదు కాని విషయం తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా ఇందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తక్కువగా పరీక్షలు జరపటం ఒక ఎత్తు అయితే.. పాజిటివ్ గా తేలుతున్న వారి సంఖ్య పెద్దగా లేకపోవటం ఇప్పటివరకూ ఊరట కలిగించే అంశం. అందుకు భిన్నంగా గడిచిన కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మేరకు వెళ్లే అవకాశం ఉంది? అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారనుంది. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి.. దానికి తగినట్లుగా ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కరు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జులై చివరి నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే వీలుందని చెబుతున్నారు. 60వేల కేసుల వరకూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.
దీనికి తగ్గట్లే ప్రభుత్వ ఏర్పాట్లు ఉన్నాయి. యాభై వేల మంది రోగులకు అవసరమయ్యే మందులు.. అది కూడా వంద రోజులకు సరిపడా ఇచ్చేందుకు వీలుగా.. మందుల నిల్వల్ని పెంచుకుంటోంది. మున్ముందు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైన పక్షంలో.. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా మందులు.. ఇతరత్రా సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
పాజిటివ్ కేసులకు సంబంధించి.. వారికుండే వ్యాధులకు అనుగుణంగా యాభై నాలుగు రకాల మందులు అవసరమవుతాయని కేసీఆర్ సర్కారు అంచనా వేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా 14 మంది ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకున్నారు. ఇలా అన్ని రకాలుగా పాజిటివ్ రోగులకు అవసరమయ్యే అన్నింటిని తెలంగాణ సర్కారు సిద్ధం చేసుకుంటోంది.