Begin typing your search above and press return to search.
లైవ్: తమిళనాడులో సీన్ రివర్స్.. డీఎంకేకు ఇది షాక్?
By: Tupaki Desk | 2 May 2021 7:14 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అన్నాడీఎంకే మెరుగైన ఫలితాలు రాబట్టడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. ఈసారి తమిళనాడులో డీఎంకే ఏకపక్ష విజయం ఖాయమని.. జయలలిత, శశికళ లేని బీజేపీతో జట్టుకట్టిన అన్నాడీఎంకే చిత్తుగా ఓడుతుందని అందరూ అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అవే చెప్పాయి. కానీ అనూహ్య ఫలితాలు వస్తున్నాయి.
డీఎంకే ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. స్టాలిన్ సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్న వేళ సీన్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అన్నాడీఎంకే గట్టిపోటీనిస్తోంది.
ఫళని స్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే గట్టిగా పోటీ పడుతోంది. డీఎంకేతో సమానంగా ఓట్లు, సీట్లు సాధిస్తోంది.
తమిళనాడులో ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం.. డీఎంకే 129 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇక అన్నాడీఎంకేకు 93 చోట్ల లీడ్ లో ఉంది. బీజేపీ 3 సీట్లు ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 8 చోట్ల లీడ్ లో ఉంది. మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో మేజిక్ మార్క్ కు చేరువగా డీఎంకే వెళ్లి ఆగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య స్వల్ప ఆధిక్యమే తేడాగా ఉంది. దీంతో ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.